=ఇదీ... పంచాయతీ కార్యదర్శుల పోస్టుల పరిస్థితి
=ఏజెన్సీలో మాత్రమే 21ఖాళీలు
=20 వేలకు పైగా అందిన దరఖాస్తులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పంచాయతీ కార్యదర్శుల భర్తీ విషయమై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులకు పెద్దగా ఒనగూరే ప్రయోజనం కనిపించడం లేదు. అధికారులు ప్రకటించిన ఖాళీలే కాకుండా పొందుపర్చిన నిబంధనలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు చేపట్టిన ప్రక్రియగానే తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ముందుచూపు లేకుండా తీసుకున్న చర్యల వల్ల కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా పూర్తిస్థాయిలో న్యాయం జరిగే అవకాశం కనిపించడం లేదు. ఏజెన్సీ ప్రాంతం, రిజర్వేషన్, రోస్టల్ విధానం, వెయిటేజీ ఇవ్వడం వంటి విషయంలో ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించక పోవడం దీనికి కారణంగా కనిపిస్తోంది.
ఖాళీల కంటే కాంట్రాక్టు ఉద్యోగులే ఎక్కువ
ప్రభుత్వం చెబుతున్న ప్రకారం కాంట్రాక్టు కార్యదర్శులందరూ 25మార్కుల వెయిటేజీతో రెగ్యులర్ అవుతారనుకుంటే... నాన్ ఏజెన్సీ ప్రాంతంలో అధికారులు చూపిస్తున్న ఖాళీల కన్నా కాంట్రాక్టు కార్యదర్శులు పది మంది ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 962పంచాయతీలు ఉండగా, వీటిలో గతంలో రెండుసార్లు కాంట్రాక్టు ద్వారా కార్యదర్శులను తీసుకున్నారు. మొత్తం 135 మందిని నియమించగా, మధ్యలో 11మంది ఉద్యోగాలు వదిలేశారు. దీంతో ప్రస్తుతం 124మందే కొనసాగుతున్నారు.
కాగా, కాంట్రాక్టు ఉద్యోగులను నేరుగా రెగ్యులర్ చేసేందుకు నిబంధనలు అడ్డొస్తాయనే భావనతో ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ అధికారులు వారికి 25మార్కులు వెయిటేజీ ఇస్తామని ప్రకటించారు. ఇక ఖాళీల విషయం పరిశీలిస్తే... మొత్తం 135 పోస్టులకు 29పోస్టులు ఏజెన్సీ ప్రాంత పంచాయతీల్లో ఉన్నాయి. ఈ పోస్టులకు ఏజెన్సీ ప్రాంతంలోని 80 గ్రామపంచాయితీల్లో ఉండేవారే అర్హులవుతుండగా, ఇప్పటికే ఎనిమిది మంది కాంట్రాక్టు కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరికి వెయిటేజీ కలిసొచ్చి రెగ్యులర్ అయితే 21 పోస్టులు మాత్రమే ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్నట్లు భావించాలి.
ఇక నాన్ ఏజెన్సీ ప్రాంతంలో 882పంచాయతీలు ఉండగా, 106పోస్టులు ఖాళీలు ఉన్నట్లు అధికారులు చూపారు. ఇక్కడ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారు 116 ఉండగా, వెయిటేజీ ఎలా ఉన్న ఉన్న పోస్టులన్నీ వీరితోనే భర్తీ చేసినా పది మందికి తక్కువ పడతాయి. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు.
కొత్త వారికి మెరిట్‌తో అవకాశం
పంచాయతీ కార్యదర్శుల పోస్టులు 135 భర్తీ చేస్తామని అధికారులు చెప్పగా అభ్యర్థులు ఆశగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే, డిగ్రీ మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నందున 80శాతానికి పైగా మార్కులు సాధించిన వారు కొంత ఆశ పెట్టుకోవచ్చు. కానీ ప్రస్తుతం 90శాతానికి పైగా మార్కులు వచ్చిన వారు కూడా దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగులు కలవరానికి గురవుతున్నారు. దీంతో నాన్‌ఏజెన్సీలో ఉన్న 106 పోస్టుల్లో ఎక్కువ మార్కులు ఉన్న వారు కాంట్రాక్టు ఉద్యోగుల కన్నా ముందుగానే సీటు ఖరారు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా, ఉన్న 135 పోస్టుల్లో రోస్టర్ విధానం అమలు చేయడం వల్ల మరికొందరు కాంట్రాక్టు ఉద్యోగులకు నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అయితే, వారి కాంట్రాక్టు కాలపరిమితి మరో ఐదు నెలలు ఉన్నందున, మరికొంత కాలం ఖాళీ పోస్టుల్లో వారిని కొనసాగించే అవకాశముంది.
ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ
కలెక్టరేట్‌లోని డీపీఓ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తులు అందజేశారు. ఆన్‌లైన్‌లో 30వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నా డీడీలతో నేరుగా కార్యాలయంలో 20వేల మంది మాత్రమే అందజేశారని అధికారులు తెలిపా రు. దీంతో వీరి దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంటారు. త్వరలో దర ఖాస్తుల పరిశీలన పూర్తిచేసి మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున జాబితా రూపొంది స్తామని డీపీఓ ఈఎస్.నాయక్ తెలిపారు. అ భ్యర్థుల పత్రాలు పూర్తిస్థాయిలో పరిశీలించి ని ర్ధారణ అనంతరం అర్హులైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని వివరించారు. కాగా, ఏజెన్సీ సర్టిఫికెట్ల విషయంలో మరింత జాగ్రత్త గా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు.
కొన్ని ఉద్యోగాలు.. ఎన్నో దరఖాస్తులు
Published Sat, Dec 7 2013 3:06 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement