ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది
నిడదవోలు :
సమాజంలో దళితులు, అనగారిన వర్గాల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు విమర్శించారు. పట్టణంలోని నందిన చారిటబుల్ ట్రస్ట్ భవనంలో సోమవారం కేవీపీఎస్ రాష్ట్ర వర్క్ షాపును ఆయన ప్రారంభించారు. ప్రారంభ సూచికగా కేవీపీఎస్ జండా ఆత్మ గౌరవం, సమానత్వం కుల నిర్మూలన లక్షలతో కూడిన జండాను మాజీ ఎమ్మెల్యే, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు దిగుపాటి రాజ్‌గోపాల్ ఆవిష్కరించారు. అనంతరం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డాక దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని, దళితుల భూములను బలవంతంగా లాక్కొవడం, భూసేకరణ పేరుతో దాడులకు పాల్పడుతున్నాడని విమర్శించారు. రాజదాని పేరుతో వందల ఏకరాల దళితుల భూములను అక్రమంగా లాక్కోవడం దారుణమన్నారు. మా భూములను ఎందుకు లాక్కొంటున్నారని ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. 2014, 15, 16 సంవత్సరాలకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇంత వరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదని మండిపడ్డారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్రు మాల్యద్రి మాట్లాడుతూ దళిత వాడలకు స్మసాన స్థలాలు కేటాయించాలని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ బ్లాక్‌లాక్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ సహాయ కార్యదర్శి పి. రామకష్ణ, జిల్లా అధ్యక్షులు దిగుపాటి రాజ్‌గోపాల్, డి. సాల్మన్, గణేష్, జువ్వల రాంబాబు, ఇంజేటి శ్రీను, ఎం. సుందర బాబు, కె. సుధీర్, గండి శ్రీను, గంటి కష్ణ తదితరులు పాల్గొన్నారు