దేవతా వనాలకు పట్టిన దెయ్యాల పీడ
సందర్భం అరణ్యకాండ -2
‘శేషాచలం’ కథ ఎన్నో ఎన్కౌంటర్ కథల్లా ముగిసిపోలేదు. ప్రభుత్వానికి, పోలీసులకు సంకటమై సశేషంగా మిగిలింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో, పలు అంచెలుగా విస్తరించిన భూతగణాల నెట్వర్క్ నుంచి మన ఎర్రచందనం వనాలను తమిళ కూలీల పీనుగులు, మునియమ్మాళ్ వంటి పేదరాళ్ల కన్నీళ్లు కాపాడగలవా?
ఉన్నపళంగా చంటిబిడ్డను చంకనేసుకొని పొద్దుటే మొదటి బస్సుకు చంద్రగిరి కొచ్చే సింది మునియమ్మాళ్. పాత చీర కొంగుతో అదేపనిగా కన్నీ రు తుడుచుకునే ఆ ఆడకూతు రికి ఎందుకీ దుఃఖమని అడిగి నవారూ లేరు, ఆమె చెప్పిందీ లేదు. తమిళం తప్ప మరే భాషా రాని ఆమె చంద్రగిరి ఠాణాకు చేరడానికే నానా తంటాలూ పడింది. పోలీసుల ప్రశ్నలకూ కన్నీళ్లే సమా ధానాలు. శేషాచలం ఎన్కౌంటర్లో మరణించిన 20 మంది తమిళ కూలీల్లో ఆమె భర్త శశికుమార్ ఒకడు. తిరువణ్ణామలై, ధర్మపురి జిల్లాల్లోని మృతుల గ్రామా లన్నీ శోకసముద్రాలయ్యాయి. ‘శేషాచలం’ నిజం తేల్చా ల్సిందేనని ప్రజా, హక్కుల సంఘాలు పట్టుబట్టాయి. శవాలను చూసి ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తి సురేష్ కూలీలు చిత్రహింసలకు గురైనట్టున్నారన్నారు.
మునియమ్మాళ్ గోడును రాష్ట్ర హైకోర్టు సుమోటో గా స్వీకరించి, ప్రజాహిత వ్యాజ్యంలో పిటిషనర్‌గా చేర్చింది. మద్రాసు హైకోర్టు శశికుమార్ మృతదేహం రీపోస్ట్ మార్టంకు ఆదేశించింది. మరో ఐదు మృతదేహా లకూ మళ్లీ శవపరీక్షలు తప్పలేదు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న బాలచందర్, ఇళంగో, శేఖర్లు సాక్షులు గా ముందుకొచ్చారు. ‘‘గుడిపాల గ్రామం వద్ద పోలీసు లు మమ్మల్ని పట్టుకున్నారు. తప్పించుకున్నవాళ్లం బతికి పోయా’’మంటూ మహేంద్రన్, మురళీ భారతీ దాసన్ వంటివాళ్లు మీడియాకు చెప్పారు. కీలక సాక్షులైన శేఖర్, బాలచంద్రన్లు తమకు ప్రాణ హాని ఉన్నదనడంతో జాతీయ మానవ హక్కుల సంఘం వారికి, వారి కుటుం బాలకు రక్షణ కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిషేధిత ప్రాంతమంటూ ఏపీ పోలీసులు హక్కుల సంఘాలను ఎన్కౌంటర్ ప్రాంతాలకు వెళ్లనివ్వ లేదు. సచ్చినోడిబండ, చీగటిగలకోన ప్రాంతాల్లో పర్య టించిన జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎన్కౌంటర్ కథ నంపై ఎన్నో సందేహాలను, మరెంతో అసంతృప్తిని వ్య క్తం చేశారు. హక్కుల సంస్థలన్నీ ఎక్కడో పట్టుకుని తెచ్చి కూలీలను కాల్చేశారంటున్నాయి. పూర్తి వివరాలతో నివే దికనివ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ‘శేషాచ లం’ కథ ఎన్నో ఎన్కౌంటర్లలా ముగిసిపోలేదు. ప్రభు త్వానికి, పోలీసులకు సంకట సశేషమైంది.
కొందరు ‘శేషాచలం’తో ఎర్రచందనం దొంగల ఆట ఇక కట్టేనన్నారు. రెండు వారాలైనా గడవకముందే కడప సబ్ డివిజన్లో నలభై గొడ్డళ్లు, ఎనిమిది ఎర్రచం దనం దుంగలతో కొందరు పట్టుబడ్డారు. అదేరోజు ప్రొద్దుటూరులో ఒక ముఠా 50 గొడ్డళ్లతో, రైల్వే కోడూ రులో పది దుంగలతో మరో ముఠా కూలీలు పట్టుబడ్డా రు. అంత పెద్ద ఎన్కౌంటర్ స్మగ్లర్లను, కూలీలను భయ పెట్టలేకపోయింది! ఏజెంట్లు తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై, చెంగల్పట్టు జిల్లాల్లోని వివిధ గ్రామాల నుంచే ఎక్కువగా కూలీలను కుదుర్చుకుని, ఐదు, పది మంది బృందాలను చేసి వివిధ ప్రాంతాల్లో చెట్లు కొట్టే పని అప్పగిస్తారు. నెల నుంచి రెండు నెలలు వారికి వనవాసమే. పది రోజుల పనికి ఒక్కొక్కరికి రూ. 30 వేలు. ఏజెంట్లే తప్ప స్మగ్లర్లు కనబడరు. పోలీసు కళ్లకు కూలీలే స్మగ్లర్లు! కొట్టిన చెట్లను డ్రెస్సింగ్ చేసిన దుంగ లుగా ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై నగరాలకు తర లిస్తారు. వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి 30 కిలోల చొప్పున విద్యార్థుల బ్యాగుల్లో పెట్టి విమానాలెక్కించి సరిహద్దులు దాటించడం, పొడి చేసి దుబాయ్ మీదుగా చైనాకు చేర్చడం రచ్చకెక్కిన పద్ధతులు. ఈ అక్రమ రవా ణాలో తమిళనాడే కీలకం. దుంగలు రోడ్డు మార్గాన చెన్నై పోర్టు చేరి విదేశాలకు ‘ఎగుమతి’ అవుతాయి. అధి కారులు స్వాధీనం చేసుకున్న సింగపూర్‌కు చేరాల్సిన ‘‘వేరుశనగపప్పు, ఉప్పు వగైరా వంట సామాగ్రి’’ కంటై నర్ అడుగున ఎర్రచందనం దుంగలున్నాయి. మరో కంటైనర్‌లో 18 టన్నుల దుంగలు దొరికాయి. అయితే స్మగ్లర్లిచ్చే ఖరీదైన బహుమతుల ప్రలోభానికి చూసీ చూడనట్టు వదిలేసే కస్టమ్స్ అధికారులకు కొదవ లే దు.
ఇక రోడ్డు మార్గాన బెంగాల్, బిహార్, యూపీ, ఉత్తరాఖండ్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలకు ఎర్రచందనం చేరుతూనే ఉంది. ప్రధానంగా ఈశాన్య రాష్ట్ర్రాల నుంచి బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటా న్, చైనాలకు వ్యూహాత్మకంగా తరలిస్తున్నారు. మయన్మా ర్కు చేరిస్తే చాలు, ప్రపంచంలో ఎక్కడికైనా సరఫరా చేసే సత్తా అక్కడి నెట్వర్క్కుంది. గుజరాత్ కాండ్లా రేవు నుంచి దుబాయ్‌కి చేర్చేది మరో దారి కాగా, అగర్తలా నుంచి చైనా, జపాన్‌లకు ఇంకో దారి. దిగువ ఏజెంట్ల నుంచి జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో, పలు అంచె లుగా విస్తరించిన ఈ భూత గణాల నెట్వర్క్ నుంచి మన ఎర్రచందనం వనాలకు రక్ష తమిళ కూలీల పీను గులు, మునియమ్మాళ్ వంటి పేదరాళ్ల కన్నీళ్లేనా?
(వ్యాసకర్త రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్టు)
మొబైల్ నం : 9440074893