ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్కు దీపిక, అభిషేక్
కోల్కతా : వచ్చే నెలలో జరిగే ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్కు స్టార్ ఆర్చర్ దీపికా కుమారి, అభిషేక్ వర్మ అర్హత సాధించారు. అంటాల్యాలో జరిగిన స్టేజి-2 ప్రపంచకప్లో కాంస్యం సాధించిన దీపికా... ఈ ఈవెంట్లో రెం డేళ్ల అనంతరం పాల్గొననుంది. 24 ప్రపంచ ర్యాంకింగ్ పాయింట్లతో తను మహిళల రికర్వ్ ఈవెంట్కు అర్హత సాధించింది. మరోవైపు గతనెలలో వార్సాలో జరిగిన ప్రపంచకప్ స్టేజి 3లో విజేతగా నిలిచిన వర్మ 39 రేటింగ్ పాయింట్లతో కాంపౌండ్ విభాగంలో పోటీపడనున్నాడు. అక్టోబర్ 24, 25న మెక్సికోలో పోటీలు జరుగుతాయి.