మా అడ్రస్ తప్పుగా ఉందేమో?
డెహ్రాడూన్: కేంద్ర ప్రభుత్వ నిధులు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి అందకపోవటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. ఆర్థిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా.. అదిగో.. ఇదిగో.. అంటూ చెబుతున్నారే తప్ప ఇంతవరకు తమ వద్దకు నిధులు చేరలేదని రావత్ అన్నారు.
ఉత్తరాఖండ్ అడ్రసు తప్పుగా నమోదై ఉండబట్టే నిధులు తమదాకా చేరటం లేదేమోనని రావత్ ఎద్దేవా చేశారు. అర్ధ కుంభమేళా, క్లీన్ గంగా పథకాలకోసం నిధులు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం తప్పించుకోలేదన్నారు. వచ్చే ఏడాది హరిద్వార్‌లో జరగనున్న అర్ధ కుంభమేళాకు రూ.500కోట్లు విడుదల చేయాలని రావత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా తొలగించాలన్న 14వ ఫైనాన్స్ కమిషన్ నివేదికలు సరికాదన్నారు.