are entitled to the list
-
అందుకో.. ఆసరా!
నేటినుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం జిల్లాలో 3.54లక్షల మందికి లబ్ధి అర్హులందరికీ కార్డుల అందజేత అన్నివర్గాలతో పాటు కళాకారులకూ పింఛన్లు పంపిణీకి పోలీసు బందోబస్తు. మహబూబ్‌నగర్: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ(ఆసరా)కి రంగం సిద్ధమైంది. అనేక అవాం తరాల నేపథ్యంలో అర్హులజాబితా ఓ కొలిక్కి వచ్చిం ది. జిల్లాలో మొత్తం 3.54లక్షల మందికి పింఛన్లు అందించేందుకు అధికారులు రంగం సిద్ధంచేశారు. గతనెల 8న సీఎం కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలో లాం ఛనంగా ప్రారంభించిన తర్వాత పూర్తిస్థాయిలో పం పిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగానికి నెలరోజుల సమయం పట్టింది. పలుమార్లు వాయిదా పడుతూ.. బుధవారం నుంచి కచ్చితంగా పంపిణీ చేయాలని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని సంకల్పించారు. ఈ మేరకు ఈనెల 15వ తేదీ వరకు పింఛన్లు పంపిణీచేయాలని జిల్లా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఇప్పటికే రూ.70కోట్లు మంజూరయ్యాయి. పంపిణీకి పోలీసుల బందోబస్తు పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పింఛన్ల మొత్తం భారీగా పెరగడంతో పాటు పంపిణీ కూడా రెండు నెలలకు కలిపి ఒకేసారి అందజేస్తున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. వృద్ధులు, వికలాంగుల నుంచి చోరీకి గురికాకుండా ఉండేం దుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజకీయవైరుధ్యాలున్న గద్వాల వంటి సున్నితమైన ప్రదేశాల్లో భారీ బందోబస్తుకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గద్వాల ఆర్డీఓను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రహసనంగా సాగిన ప్రక్రియ.. పింఛన్ల పంపిణీ పథకానికి ఆదినుంచీ అడ్డుంకులు ఎదురయ్యాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీమేరకు వికలాంగులకు రూ.1,500, వృద్ధు లు, వితంతువులు, చేనేత, కల్లుగీత కార్మికులకు రూ.1,000 చొప్పున అందజేయాలని నిర్ణయించింది. సామాజిక పింఛన్ల పంపిణీ అర్హులకే అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొదట నిర్ధేశించిన విధంగా దరఖాస్తుల పరిశీలన ప్రారంభించగా విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే సమగ్ర సర్వేలో పొంతన కుదరకపోవడంతో కాస్త ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గిన ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీచేసి అందుకు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించారు. -
మాఫీ మాయ
బ్యాంకర్ల చుట్టూ రైతుల ప్రదక్షిణ మెజార్టీ బ్యాంకులకు చేరని జాబితాలు అర్హులకు దక్కని చోటు అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరం దగా చేశారు.. రుణమాఫీపై ప్రభుత్వ ప్రకటన అధికారులు.. బ్యాంకర్లు.. రైతులను గందరగోళంలోకి పడేసింది. ఎవరు అర్హులో.. ఎవరు అనర్హులో.. ఎవరికిమాఫీ అయిందో.. ఎవరికి కాలేదో.. తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. సీఎం ప్రకటించి ఆరురోజులు గడిచి పోయాయి. జాబితా విడుదలచేసి నాలుగురోజులైంది. ఏ బ్యాంకు వద్ద పూర్తి స్థాయిలో సమాచారం లేదు . కొన్నిశాఖలలో జాబితాలు ప్రకటించినా వాటిలో అర్హులకుచోటు దక్కని దుస్థితి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా సాక్షి బృందం మండలాల వారీగా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణమాఫీపై పరిశీలన జరపగా అంతటా గందరగోళమే నెలకొంది. విశాఖపట్నం: జిల్లాలో 3.87లక్షల ఖాతాలుంటే రూ.50వేల రుణమాఫీ సీలింగ్ పేరుతో కేవలం లక్ష 30వేల 979 ఖాతాలకు మాత్రమే పరిమితమైంది. మిగిలిన 2.83,021 ఖాతాల్లో మరో లక్షమంది వరకు అర్హులున్నప్పటికీ వారికి మొండిచేయే మిగిలింది. వీటిలో 50వేలకుపై బడి రూ.500ల నుంచి ఐదువేల లోపు ఉందనే సాకుతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ జాబితాలోకి చేర్చినట్టు చెబుతున్నప్పటికీ 70 శాతం మందికి అర్హుల జాబితాలో చోటు దక్కలేదు. సాధారణంగా ఏజెన్సీలోని గిరిజన రైతులంతా 50వేల లోపు రుణం తీసుకున్న వారే. కానీ జాబితాలో చోటు దక్కింది మాత్రం 35 శాతం లోపే. ఉదాహరణకు వి.మాడుగలలో పదివేల మందికి పైగా రైతులుంటే కేవలం 4వేల మందికే జాబితాలో చోటు దక్కింది. కోటపాడులో 8వేలమందిరైతులుంటే కేవలం 3వేల మందికే మాఫీ వర్తించింది. భీమిలి నియోజకవర్గంలో ఏకంగా 6వేల మంది రైతులకు రూ.12.5కోట్ల రుణాలుంటే అర్హుల జాబితాలో ఏ ఒక్కరికి చోటు దక్కలేదు. ఇక్కడ పీఎస్సీఎస్ పరిధిలో రూ.50వేల లోపు రుణాలున్న రైతులు 720మంది ఉంటే కేవలం 62 మందికి మాత్రమే జాబితాలో చోటు దక్కింది. ఏజెన్సీలో ఒక్కమండలానికే: ఏజెన్సీలో కేవలం కొయ్యూరు మండల పరిధిలోని రైతులకు మాత్రమే మాఫీ వర్తించింది. మిగిలిన మండలాల్లోని సోసైటీల్లో ఎక్కడా జాబితాలనే ప్రదర్శించలేదు. మైదానంలో కేవలం పది మండలాల్లో మాత్రమే అదీ కూడా కొన్ని బ్యాంకుల్లోనే మంగళవారం జాబితాలను ప్రదర్శించారు. 50వేల లోపు రుణాలు తీసుకున్నవారు ఎక్కువ మంది సహకార సంఘాల పరిధిలోనే ఉంటారు. సొసైటీల పరిధిలో రూ.250కోట్లకు పైగా రుణాలున్నాయి. వీటిలో కనీసం 80 శాతం రుణాలు తొలి జాబితాలోనే చోటు దక్కాల్సి ఉన్నప్పటికీ కనీసం 40శాతం రుణాలు కూడా మాఫీకాని పరిస్థితి నెలకొంది. రేపటి నుంచి మాఫీ సర్టిఫికెట్ల జారీ: ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు క్షేత్ర స్థాయి లో రైతుసాధికారత సదస్సుల పేరిట స మావేశాలు నిర్వహించి అర్హులైన రైతులకు మాఫీ సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు బ్యాంకర్లు, జిల్లా అధికారులకు ఎలాంటి మార్గదర్శకాలు జారీకాలేదు. కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే గడువు ఉండడంతో ఏం చేయాలో పాలుపోనిస్థితిలో ఉ న్నామని డీఆర్వో నాగేశ్వరరావు సాక్షికి తెలిపా రు. బుధవారం నాటికి క్లారిటీ వస్తుందన్నారు. మోసపోయాం.. ప్రభుత్వం మోసం చేసింది. నాకు పాడేరు డీసీసీబీ బ్యాంకులో 40వేల రుణం ఉంది. వడ్డీతో 50వేల లోపే ఉంది. కానీ జాబితాలో నా పేరు లేదు. అడిగితే మీకు రాలేదంటున్నారు. ఎందుకురాలేదని అడిగితే సమాధానం చెప్పే వారే కరువయ్యారు. పైగా కసురుకుంటున్నారు.ఎందుకు మాఫీ కాలేదో కూడా చెప్పే పరిస్థితిలేదు. -మువ్వల సత్యనారాయణ, గిరిజన రైతు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు రెండు రోజులుగా రుణ మాఫీ జాబితా గురించి బ్యాంకు చుట్టూ తిరుతున్నా జాబితా రాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. చీడిగుమ్మల సొసైటీలో రూ.30 వేలు, నర్సీపట్నం ఏడీబీ బ్యాంకు నుంచి రూ.30 వేలు తీసుకున్నారు. సొసైటీలో రుణమాఫీ గురించి అడిగితే రాలేదంటున్నారు. ఏబీడీ బ్యాంక్ వస్తే అసలు రుణ జాబితా రాలేదని చెబుతున్నారు. ప్రభుత్వం పూటకో ప్రకటనతో రైతులను ఇబ్బంది పెడుతున్నది. -గండి శ్రీను, చీడిగుమ్మల నాది ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు.ఖరీఫ్ కోసం గతేడాది ఎస్.రాయవరం మండలం గుడివాడ ఎస్బీఐలో రూ.40వేల రుణం తీసుకున్నారు. పుస్తెలతాడుతో సహా బంగారు ఆభరణాలు కుదువపెట్టి మరో పాతికవేల తీసుకున్నాను. పంట కలిసిరాలేదు. చంద్రబాబు హామీతో అప్పు మాఫీ అవుతుందని ఆశపడ్డాను. మాఫీ జాబితాలో నా పేరు లేదు. ఇంతకంటే దగా ఇంకేముంటుంది. -కె.సత్యలక్ష్మి -
రైతు వ్యధ పట్టని బాబు
రుణాలు రద్దు చేసే సత్తా లేనప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత హామీ ఎందుకు ఇచ్చినట్టు..ఏరుదాటి తెప్ప తగలేసేందుకా..దేశానికి పట్టెడన్నం పెట్టే రైతులను అవమానించేందుకా..వ్యవసాయాన్ని ఎగతాళి చేసేందుకా.. సీఎం గా చంద్రబాబు తొలి సంతకం చేసిన నాటి నుంచి రుణమాఫీ కోసం ఎదురు చూడని రైతూ లేడు..ఎదురు చూడని కుటుంబం లేదు.. పాలనా పగ్గాలు చేపట్టి 150 రోజులు గడిచినా హామీ ఇచ్చిన రూ.1.50 లక్షల రుణం మాఫీ అమలు కాకపోగా సవాలక్ష సందేహాలు రైతుల బుర్రలు తొలుస్తున్నాయి. సత్తెనపల్లి: జిల్లాలో రైతు రుణమాఫీపై స్పష్టత కొరవడింది. ఎవరి రుణాలు మాఫీ చేస్తారు, ఎవరి పేర్లు తొలగిస్తారు అనే విషయాలు రైతులకు బోధపడడం లేదు. రెండు రోజుల కిందట ప్రభుత్వం రుణమాఫీ అర్హుల జాబితా విడుదల చేసినా క్షేత్ర స్థాయిలో వివరాలు తెలియడం లేదు. శనివారం గ్రామ రెవెన్యూ అధికారుల వద్దకు జాబితాలు వచ్చాయి. ఆ జాబితాల్లో ఉన్న రైతులు రుణమాఫీకి అర్హులా, అనర్హులా పరిశీలించి పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు వీఆర్వోలు గ్రామాల్లో పరిశీలన చేస్తున్నారు. రైతుల నుంచి రేషన్, ఆధార్ కార్డు కాపీలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమపేర్లు జాబితాలో ఉన్నాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న అందరి రైతుల పేర్లు ఈ జాబితాల్లో ఉన్నాయా, బ్యాంకుల్లో సరైన ఆధారాలు అందించనివారివా మాత్రమే ఉన్నాయా అనేది స్పష్టత లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వివరాల కోసం రైతులు బ్యాంకుల వద్దకు వెళితే జాబితాలు తహశీల్దారుల వద్దకు వచ్చాయని చెబుతూ, గ్రామాలకు రెవెన్యూ అధికారులు వస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ జాబితాలో పేర్లు లేనివారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా, ఇటు రెవెన్యూ అధికారులు, అటు బ్యాంకర్లు చెప్పలేకపోతున్నారు. రుణమాఫీ కటాఫ్ తేదీ ప్రకటించకపోవడంతో రైతుల్లో అనేక అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. 2013 డిసెంబరు 31వ తేదీనా, లేక 2014 మార్చి 31వ తేదీనా అనేది జాబితా పరిశీలనకు వచ్చిన అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. రెండు రోజుల నుంచి రైతులు పనులు మానుకుని తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నారు. సరైన పత్రాలు లేకపోతే అక్కడే అందించేందుకు పత్రాలు చేతపట్టుకుని వెళుతున్నారు. ఇప్పటికైనా రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.