మమ్మల్ని కించపరచకండి!
ఇతరులను నిందించడానికీ, ముఖ్యంగా కిరాతుకుడు వంటి ముద్ర వేయడానికి కొన్ని కింది వర్గాల పేర్లను ఉపయోగించడం పూర్వం ఎక్కువగా ఉండేది. ఈ వర్గాలకు సంబంధించిన వారి పోరాటం ఫలితంగా కొద్దికాలం ఈ ధోరణి ఆగింది. కానీ ఇటీవల మళ్లీ అది తలెత్తుతున్న జాడలు కనిపించడం దురదృష్టకరమని ఆరెకటిక పోరాట సమితి తరఫున సమాజం దృష్టికి తీసుకువస్తున్నాను. ఆరెకటికలు బీసీ డికి చెందిన వారు. కులవృత్తి మేక మాంసం విక్రయిం చడం.
ఇప్పటికీ కొన్ని కుటుంబాలు ఆ వృత్తి మీదే ఆధారపడి ఉన్నాయి. కానీ చాలామంది చదువు కుని ఇతర వృత్తులు చేపట్టారు. అయినా వీరి కులం పేరుతో ఉన్న పదాలను దూషణకు ఉపయోగించడం ఆగడం లేదు. కొన్ని సినిమాలలో, టీవీ సీరియళ్లలో, కొన్ని వార్తాపత్రికలలో ‘కటిక’, ‘కసాయి’ అన్న పదాలు ఇంకా ప్రయోగిస్తున్నారు. ఇది మా మనోభావాలను దెబ్బతీయడమే. ఈ కులం వారు మాంసం విక్రయించినంత మాత్రాన కర్కోటకులు కాదు. ఇలాంటి పదా లను వాడవద్దని మా సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.
మాల్ఖేదికర్ గురుచరణ్
సమితి రాష్ట్ర కన్వీనర్, సికింద్రాబాద్