ఏసీబీకి చిక్కిన నగర పాలక ఉద్యోగి
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థలో అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా జీహెచ్ఎంసీలో ఏరియా ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మెహెదీఅలీ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా మంగళవారం పట్టుబడ్డాడు.
వివరాల ప్రకారం... జీహెచ్ఎంసీలో ఏరియా ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మెహెదీఅలీ, అక్కడే అటెండర్‌గా పనిచేస్తున్న వంశీ అనే ఉద్యోగితో కలిసి ఒకరి నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వీరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.