నాణ్యతలో మేటి.. భారతి సిమెంట్
- సంస్థ ఏరియా మేనేజర్ సతీష్‌కుమార్
- రామాయంపేటలో తాపీ మేస్త్రీలకు ప్రమాద బీమా బాండ్ల అందజేత
రామాయంపేట: సిమెంటు తయారీ రంగంలో భారతి సిమెంట్ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని ఆ సంస్థ ఏరియా మేనేజర్ సతీష్‌కుమార్ అన్నారు. స్థానిక శ్రీనివాస స్టీల్ మర్చంట్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలో సోమవారం రాత్రి వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర సిమెంట్లతో పోల్చుకుంటే భారతి సిమెంట్ మూడు రెట్లు మెరుగ్గా పని చేస్తుందని తెలిపారు. అందువల్లే వినియోగదారులు దీన్ని వాడేందుకు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. రోబోటెక్ క్వాలిటీ, జర్మనీ టెక్నాలజీ, టాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్ వంటి అత్యున్నత ప్రమాణాలతో భారతి సిమెంట్‌ను అందజేస్తున్నామని తెలిపారు.
రెండేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో భారతి సిమెంట్ ప్లాంట్ నెలకొల్పామని వివరించారు. దీని ద్వారా నెలకు 2.75 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. మెదక్ జిల్లాలోని డీలర్లందరికీ ఇక్కడి నుంచే సిమెంట్ సరఫరా చేస్తున్నామన్నారు. తమ సంస్థ తరఫున వినియోగదారులు, భవన నిర్మాణ రంగ కార్మికులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా వంద మంది తాపీ మేస్త్రీలకు రూ. లక్ష చొప్పున ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించామన్నారు.
దీనికి సంబంధించిన బాండ్లను సోమవారం వారికి అందజేశారు. భారతి సిమెంట్ ఆధ్వర్యంలో జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామని సతీష్‌కుమార్ పేర్కొన్నారు. ఇటీవల ఏడుపాయల ఆలయంలో లక్ష వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశామని, జోగిపేటలో రెండు వేల మందికి అన్నదానం చేశామని చెప్పారు. భారతి సిమెంట్ తయారీ విధానం, నాణ్యత తదితర అంశాలను ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ మేనేజర్ యశ్వంత్, టెక్నికల్ ఆఫీసర్ అరవింద్, డీలర్ దోమకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.