Arjun Meghwal
-
కేంద్రమంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం
లక్నో: కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రికి ప్రమాదం తప్పింది. వేడుకల్లో వేదిక కూలిపోవడంతో ఫ్లడ్ లైట్లు వేదికపైనున్న నేతపై పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు నేతలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం... ఆగ్రాలో అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వేదికపైన ఎక్కువ మంది ఉండటంతో ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. దీంతో ఫ్లడ్ లైట్లు అక్కడున్న నేతలపైన పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. Organiser of the event also got injured. #Agra pic.twitter.com/nXpoI8MSpj — Anuja Jaiswal (@AnujaJaiswalTOI) April 15, 2022 కాగా, ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రికి తృటిలో ప్రమాదం తప్పింది. స్ధానిక పోలీసులు, భద్రతా సిబ్బంది కిందపడిన ఆయనను పైకిలేపారు. ఆయనకు గాయాలేవీ కాకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు, వేదికపైన ఎక్కువ మంది ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. Union minister of state for parliamentary affairs and culture Arjun Ram Meghwal had a narrow escape after a heavy light stand fell down following hail storm in #Agra. He was a chief guest to attend Dr Bheem Rao Ambedkar Jayanti. At least 6 people were #injured in the mishap. pic.twitter.com/spMx7ZaU6a — Anuja Jaiswal (@AnujaJaiswalTOI) April 15, 2022 -
రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏకం!
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను ఒకే కేంద్ర పాలిత ప్రాంతం కిందకు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వచ్చే వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ లోక్‌సభలో శుక్రవారం తెలిపారు. పాలనను మరింత సులభతరం చేసేందుకే వీటిని కలపనున్నట్లు చెప్పారు. కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వీటికి వేర్వేరు సచివాలయాలు, బడ్జెట్ ఉన్నాయి. రెండు ప్రాంతాలను ఏకం చేసిన తర్వాత ఏర్పడే కేంద్రపాలిత ప్రాంతానికి ‘దాద్రా, నాగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. దీంతో కేంద్రపాలిత పారంతాల సంఖ్య 8కి తగ్గనుంది. -
టెలిఫోన్ ఆపరేటర్ నుంచి కేంద్రమంత్రిగా
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారోత్సవానికి సర్వం సిద్దమైంది. ప్రాథమికంగా అందుతున్నసమాచారం ప్రకారం ప్రధాని నరేంద్రమోదీ సహా మొత్తం 60మంది మంత్రులతో జెంబో క్యాబినెట్ కొలువు దీరనుంది. ఈ మేరకు రాష్ట్రపతిభవన్‌లో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే పలువురి కొత్తవారితోపాటు 46 మంది మంత్రులు ఖరారయ్యారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన శివసేన, జేడీయూ, అప్నాదళ్, ఎల్జేపీ సభ్యులకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కనుంది. మరోవైపు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేబినెట్లో బెర్త్ దక్కింది. ముఖ్యంగా కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రాజస్థాన్ ఎంపీ అర్జున్ రామ్ మేఘవాల్ (65) ఒకరు. మూడుసార్లు ఎంపీగా గెలిచి వరుసగా రెండవసారి మోదీ 2.0లో స్థానం దక్కించుకోనున్నారు. గతంలో మోదీ నేతృత్వంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల, నీటివనరులు, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రెజువెనేషన్ మంత్రిగా మేఘవాల్ పని చేశారు. తనకు కూడా పిలుపు వచ్చిందనీ, ఇందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాననంటూ మేఘవాల్ సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మేఘవాల్ కరియర్, రాజకీయ ప్రస్థానం 1977లో లా కోర్సు, 1979 ఆర్ట్స్‌లో పీజీ చేశారు. అనంతరం ఇండియన్ పోస్ట్ అండ్ టెలీగ్రాఫ్ డిపార్ట్మెంట్లో టెలిఫోన్ ఆపరేటర్‌గా కరియర్‌ను ప్రారంభించారు. ఆ ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు. 1982లో ‘రాస్’ (రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్) అర్హత సాధించి రాజస్థాన్ ఉద్యోగ్ సేవాకు అసిస్టెంట్ డైరెక్టరయ్యారు. 1994లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హరిశంకర్ బాబ్డాకు ఓఎస్డీగా నియామకం. అలా ఐఏఎస్‌కు ప్రమోటై పలు కీలక పదవులను నిర్వహించారు. ఫిలిప్సీన్స్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా సాధించారు. వివిధ రంగాల్లో పరిశోధన చేశారు. ముఖ్యంగా కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి ఆంగ్లంలో కొన్ని సాహిత్య పేపర్స్‌ను సమర్పించారు. ఐఏఎస్‌గా రాజీనామా చేసి 2009లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మాజీ ఐఎఎస్ అధికారి అయిన అర్జున్ మేఘవాల్ బికనూర్ పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు లోక్‌సభకు ఎంపిక కావడం విశేషం. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని 19వేల ఓట్ల మెజార్టీతో ఓడించారు. 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంకర్ పన్నూపై విజయం సాదించారు. తాజా ఎన్నికల్లో 6.5 లక్షల ఓట్లతో కాంగ్రెస్ పార్టీకే చెందిన మదన్ గోపాల్ మేఘవాల్‌ను ఓడించారు. 2004లో ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర బికనీర్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అవార్డులు 2013లో ‘బెస్ట్ పార్లమెంటేరియన్’ అవార్డు కూడా దక్కించుకున్నారు. దీనితోపాటు మరికొన్ని అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. -
ఇద్దరు సైక్లిస్టులకు కేబినెట్లో చోటు
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ కేబినెట్లో ఇద్దరు సైక్లిస్టులకు చోటు దక్కింది. కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న బీజేపీ ఎంపీలు మన్సుఖ్భాయ్ మాండవీయ, అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రపతి భవన్‌లోని అశోకా హాల్లో వీరిరువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు మన్సుఖ్భాయ్ మాండవీయ, అర్జున్ రామ్ మేఘవాల్...సైకిళ్లపై రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. కాగా రాజస్థాన్‌లోని బికనీర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ రామ్ మేఘవాల్ మొదటి నుంచి ఆడంబరాలకు దూరం. గతంలో కాలుష్యం తగ్గించేందుకు వారంలో ఎంపీలు కనీసం ఒక్కసారయినా పార్లమెంట్‌కు సైకిల్ మీద రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడంతో ఆయన అప్పటి నుంచే సైకిల్‌పైనే పార్లమెంట్ సమావేశాలకు హాజరు అవుతున్నారు. ఇక గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మన్సుఖ్భాయ్ మాండవీయ కూడా పార్లమెంట్ సమావేశాలకు సైకిల్లో హాజరయ్యేవారు. అలాగే వ్యవసాయ రంగంలో మాండవీయ విశేష కృషి చేశారు.