పొలిటీషియన్ కొడుకుతో హీరోయిన్?
బాలీవుడ్లో డేటింగ్ రూమర్స్ సర్వసాధారణం. పలానా హీరో, హీరోయిన్లు ప్రేమలో ఉన్నారంటూ రోజుకో పుకారు పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇక హీరోయిన్ల గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఏ సెలెబ్రిటీతో అయినా కలిసి ఫోటో దిగితే చాలు..వాళ్లిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు పుట్టుకొస్తాయి. వాటిల్లో కొన్ని నిజమైన సందర్భాలూ ఉన్నాయి. ఇక ఈ సారి సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు, హీరోయిన్ సారా అలీఖాన్‌పై డేటింగ్ రూమర్స్ వచ్చాయి.పొలిటిషీయన్ కొడుకుతో ప్రేమాయణంసారా అలీఖాన్ ప్రేమలో పడిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రముఖ మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వాతో సారా గత కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. అర్జున్‌కి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. పంజాబ్‌కి చెందిన బీజేపీ నేత ఫతే జంగ్ సింగ్ బజ్వా కొడుకు ఈయన. అర్జున్ మినహా ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95)అలా మొదలైంది..ఇటీవల సారా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లింది.ఈ పర్యటననే డేటింగ్ రూమర్లకి కారణమైంది. సారాతో పాటు అర్జున్ కూడా కేదార్నాథ్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలోనే వీరిద్దరు మరింత క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.వీరిద్దరు కలిసి దర్శనం చేసుకుంటున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అప్పటి నుంచి అర్జున్-సారా డేటింగ్లో ఉన్నారనే రూమర్స్ మొదలైయ్యాయి. అయితే ఈ డేటింగ్ రూమర్స్‌పై అటు సారా కానీ, ఇటు అర్జున్ కానీ స్పందించలేదు. (చదవండి: మరోసారి తల్లయిన హీరోయిన్.. బేబీ బంప్స్ ఫొటోలు) View this post on Instagram A post shared by Arjun Pratap Bajwa (@bajwaarjun)