ఘాజీ సినిమాకు పన్ను మినహాయిస్తారా?
ముంబై: దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఘాజీ సినిమాకు కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ సినిమా మొదటి వారంలో దేశవ్యాప్తంగా రూ.19 కోట్ల 40 లక్షల వసూలు చేసింది. పన్ను మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు హీరో రానా తెలిపారు.
ఈ సినిమా 1971లో భారత్-పాక్‌ల మధ్య జరిగిన నేవీ యుద్ధ సన్నివేశాలతో తెరకెక్కింది. ఈ యుద్దం మొత్తం 18 రోజుల పాటు సముద్రం లోపల జరిగింది. అప్పటి భారత నేవీకి లెప్ట్నెంట్ కమాండర్ అర్జున్ వర్మ పాత్రలో రానా నటించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చిందని, త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభిస్తుందని ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి, నటులు అతుల్ కులకర్ణి, కేకే మీనన్‌లు ఆశాభావం వ్యక్తం చేశారు.