కోసిన కాయ వద్దన్నందుకు కత్తితో దాడి
విక్రేత దుశ్చర్య
కొనుగోలుదారుడికి గాయాలు
నూజివీడులో ఘటన
స్థానికులు దేహశుద్ధి చేయడంతో అమ్మకందారుడికీ గాయాలు
నూజివీడు, న్యూస్‌లైన్ : ‘కోసిన కాయలోని ముక్కలు వద్దు.. మ రో కాయ కొయ్యి’ అని అడిగిన వ్యక్తిపై పుచ్చకాయల వ్యాపారి కత్తితో దాడి చేశాడు. పట్టణంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో కాయ కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తికి గాయాల య్యా యి. దీనిపై స్థానికులు స్పందించి దేహశుద్ధి చేయడంతో అమ్మకందారుడికి కూడా గాయాల య్యా యి. బాధితుడు, పోలీసులు తెలిపిన సమా చా రం ప్రకారం వివరాలిలా ఉన్నాయి..
రెడ్డిగూడెం మండలం రుద్రవరం తండాకు చెందిన జరపుల గోపి నూజివీడులోని మార్కెట్‌యార్డు ఎదురుగా ఉన్న రోడ్డులో శుక్రవారం పుచ్చకాయలు అమ్ముతున్నాడు. పట్టణంలోని రామాయమ్మరావుపేటకు చెందిన వల్లెపు అర్జునరావు(45) సాయంత్రం ఐదు గంటల సమయం లో గోపి వద్దకు వెళ్లి పుచ్చకాయ ముక్కలు కోసి ఇవ్వమని కోరాడు. దీంతో అతడు అప్పటికే కోసి ముక్కలు ఇవ్వబోయాడు. అవి తనకు వద్దని వేరే కాయ కోసి ఇవ్వమని అర్జునరావు చెప్పాడు. దీం తో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి, తీవ్ర రూపం దాల్చింది.
గోపి ఆగ్రహంతో పుచ్చకాయలు కోసే కత్తితో అర్జునరావు పొట్టలో పొడిచాడు. ఈ ఘటనలో గాయపడిన అతడు కేకలు వేయగా ఆ ప్రదేశంలో ఉన్నవారు వచ్చి గోపికి దేహశుద్ధి చేశా రు. బాధితుడిని హుటాహుటిన పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసి 24 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచారు. గాయపడిన గోపీకి కూడా ఏరియా ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.