army check post
-
కశ్మీర్లో పోలీసులను చితకబాదిన సైనికులు
శ్రీనగర్: ఆర్మీ వాహనాన్ని చెక్‌పోస్టు వద్ద ఆపివేశారని కశ్మీర్ పోలీసులను సైనికు లు చితకబాదారు. గాందేర్‌బల్ జిల్లాలో శుక్రవారంజరిగిన ఈ ఘటనలో ఏడు గురు పోలీసులు గాయపడ్డారు. దీంతో ఆ సైనికులపై కేసు నమోదైంది. అమర్ నాథ్ యాత్ర డ్యూటీ ముగించుకున్న కొందరు ఆర్మీ జవాన్లు సివిల్ డ్రస్‌లో బల్తాల్ బేస్ క్యాంపు నుంచి ప్రైవేటు వాహనాల్లో బయలుదేరారు. సోనామార్గ్ చెక్‌పోస్టు వద్ద వాహనాలను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారు ఆప కుండా గందర్బల్ వైపునకు వేగంగా వెళ్లారు. ఈ సైనికులను సోనామార్గ్ చెక్‌పోస్టు వద్ద అక్కడి పోలీసులు అడ్డుకు న్నారు. దీంతో కోపంతో పోలీçసులను జవాన్లు చితకబాదారు. గుండ్ పోలీస్ స్టేషన్లోకి చొరబడి డెస్స్‌టాప్‌లు, లాప్ ట్యాప్‌లు సహా సామగ్రిని, రికార్డులను ధ్వంసం చేశారు. -
ఎన్కౌంటర్లో తొమ్మిది మంది తీవ్రవాదుల హతం
పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతమైన ఉత్తర వజీరిస్థాన్‌లో నిన్న రాత్రి భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది తీవ్రవాదులు మరణించారని స్థానిక మీడియా మంగళవారం ఇక్కడ వెల్లడించింది. ఆర్మీ చెక్ పోస్ట్‌పై తీవ్రవాదులు ఆకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఆర్మీ సిబ్బంది వెంటనే తెరుకుని కాల్పులు జరిపిందని వివరించింది. అయితే ఆ ఘటనలో ఆర్మీ సిబ్బందికి ఎటువంటి గాయాలైనట్లు సమాచారం అందలేదని పేర్కొంది. అలాగే దక్షిణ వజీరిస్థాన్‌లో ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న కాన్వాయిని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు మందు పాతర పేల్చారు. ఆ దుర్ఘటనలో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రెండు ఘటనలకు తామే బాధ్యులమని ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని స్థానిక మీడియా పేర్కొంది.