కశ్మీర్‌లో పోలీసులను చితకబాదిన సైనికులు | Soldiers thrash JK cops after vehicles stopped at checkpost, Army plays down incident | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో పోలీసులను చితకబాదిన సైనికులు

Published Sun, Jul 23 2017 1:18 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

కశ్మీర్‌లో పోలీసులను చితకబాదిన సైనికులు

కశ్మీర్‌లో పోలీసులను చితకబాదిన సైనికులు

శ్రీనగర్‌: ఆర్మీ వాహనాన్ని చెక్‌పోస్టు వద్ద ఆపివేశారని కశ్మీర్‌ పోలీసులను సైనికు లు చితకబాదారు. గాందేర్‌బల్‌ జిల్లాలో శుక్రవారంజరిగిన ఈ ఘటనలో ఏడు గురు పోలీసులు గాయపడ్డారు. దీంతో ఆ సైనికులపై కేసు నమోదైంది. అమర్‌ నాథ్‌ యాత్ర డ్యూటీ ముగించుకున్న కొందరు ఆర్మీ జవాన్లు సివిల్‌ డ్రస్‌లో బల్తాల్‌ బేస్‌ క్యాంపు నుంచి ప్రైవేటు వాహనాల్లో బయలుదేరారు.

సోనామార్గ్‌ చెక్‌పోస్టు వద్ద వాహనాలను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారు ఆప కుండా గందర్‌బల్‌ వైపునకు వేగంగా వెళ్లారు. ఈ సైనికులను సోనామార్గ్‌ చెక్‌పోస్టు వద్ద అక్కడి పోలీసులు అడ్డుకు న్నారు. దీంతో కోపంతో పోలీçసులను జవాన్లు చితకబాదారు. గుండ్‌ పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడి డెస్స్‌టాప్‌లు, లాప్‌ ట్యాప్‌లు సహా సామగ్రిని, రికార్డులను ధ్వంసం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement