Kashmir police
-
మిస్సయిన కశ్మీర్ కానిస్టేబుల్ ఏమయ్యాడంటే...
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో సోషల్ మీడియాలో ఇష్ఫక్ అహ్ దార్ అనే వ్యక్తి ఫోటో తెగ వైరల్ అవుతోంది. చేతిలో ఏకే 47 తో దర్శనమిచ్చిన అతను తానోక టెర్రరిస్టునన్న విషయాన్ని కింద ఓ సందేశంలో పేర్కొన్నాడు. కానీ, అతను మాత్రం కనిపించకుండా పోయిన ఓ ట్రెయినీ పోలీస్ అన్నది ఇప్పుడు స్పష్టం అయ్యింది. కశ్మీర్లో కొన్ని రోజుల క్రితం ఓ యంగ్ పోలీస్ అధికారి మాయం కావటం కలకలం రేపింది. కతువా జిల్లాలోని ట్రెయినింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న 24 ఏళ్ల ఇష్ఫక్ అహ్మద్ అహ్మద్ దార్ సెలవులపై ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. అక్టోబర్ 23వ తేదీనే అతను రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా.. అది జరగకపోవటంతో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు అతని స్వగ్రామం హెఫ్ షరిమల్కు వెళ్లారు. అయితే అతను ఎప్పుడో ఇంటి నుంచి బయలుదేరాడని చెప్పటంతో వెనక్కి వచ్చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు ఇష్ఫక్ కనిపించటం లేదని పోలీస్ ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో ఓ వీడియో విడుదలయ్యింది. అతను పాక్ ఉగ్రప్రేరేపిత సంస్థ లష్కర్-ఇ-తాయిబాలో చేరినట్లు అధికారులు ధృవీకరించారు. అష్ఫక్ ఒక్కడే కాదు గత ఆరు నెలల్లో ఇలా అరడజనుకు పైగానే పోలీసు అధికారులు ఉగ్రవాదం వైపు మళ్లినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
కశ్మీర్లో పోలీసులను చితకబాదిన సైనికులు
శ్రీనగర్: ఆర్మీ వాహనాన్ని చెక్‌పోస్టు వద్ద ఆపివేశారని కశ్మీర్ పోలీసులను సైనికు లు చితకబాదారు. గాందేర్‌బల్ జిల్లాలో శుక్రవారంజరిగిన ఈ ఘటనలో ఏడు గురు పోలీసులు గాయపడ్డారు. దీంతో ఆ సైనికులపై కేసు నమోదైంది. అమర్ నాథ్ యాత్ర డ్యూటీ ముగించుకున్న కొందరు ఆర్మీ జవాన్లు సివిల్ డ్రస్‌లో బల్తాల్ బేస్ క్యాంపు నుంచి ప్రైవేటు వాహనాల్లో బయలుదేరారు. సోనామార్గ్ చెక్‌పోస్టు వద్ద వాహనాలను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారు ఆప కుండా గందర్బల్ వైపునకు వేగంగా వెళ్లారు. ఈ సైనికులను సోనామార్గ్ చెక్‌పోస్టు వద్ద అక్కడి పోలీసులు అడ్డుకు న్నారు. దీంతో కోపంతో పోలీçసులను జవాన్లు చితకబాదారు. గుండ్ పోలీస్ స్టేషన్లోకి చొరబడి డెస్స్‌టాప్‌లు, లాప్ ట్యాప్‌లు సహా సామగ్రిని, రికార్డులను ధ్వంసం చేశారు. -
ఈరోజు నుంచి అక్కడ సోషల్ మీడియా బంద్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి సోషల్ మీడియా వెబ్సైట్లను నిలిపివేయాలని ఆ రాష్ట్ర పోలీసులు సూచించారు. మళ్లీ ఆదేశాలిచ్చే వరకు సేవలు ఆపు చేయాలని కోరారు. హిజ్బుల్ నేత బుర్హాన్ వనీ ప్రథమ వర్థంతి ఈ వారాంతంలో ఉన్నందున ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకుంటున్నట్లు ఐజీ మునీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. జాతి వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్ను వేదికగా చేసుకునే విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, అందుకే సేవలను నిలిపివేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాసైట్లను మూసి వేయటం సాధ్యంకాని పక్షంలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేయాలని సర్వీస్ ప్రొవైడర్లను కోరామన్నారు. ముందుజాగ్రత్తగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేయాలని కోరనున్నట్లు సమాచారం. ఇప్పటికే భద్రతా బలగాలను భారీగా మోహరించిన యంత్రాంగం పూర్తి అప్రమత్తత ప్రకటించింది. గత ఏడాది జూలై 8వ తేదీన భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో బుర్హాన్ మృతి చెందాడు. అప్పటి నుంచి కాశ్మీర్లో చెలరేగిన అల్లర్లలో దాదాపు 85 మంది చనిపోగా వందలాదిమంది గాయాలపాలయ్యారు. బుర్హాన్ వర్థంతి రోజైన ఈనెల 8వ తేదీన పోలీసులు, సైన్యంపై రాళ్లు రువ్వాలని ఇప్పటికే వేర్పాటువాదులు ప్రజలకు పిలుపునిచ్చారు. -
‘తొలిరాత్రి సమాధిలో నాకేమవుతుంది?’
‘సమాధి లోపల ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. భూమి లోపల.. చీకటిలో ఒక్కడే ఉండటం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి’... ఇది తన మరణాన్ని ముందే ఊహిస్తూ ఫిరోజ్ అహ్మద్ రాసిన ఫేస్బుక్ పోస్టు. 32 ఏళ్ల ఫిరోజ్ అహ్మద్ దార్ జమ్మూకశ్మీర్ పోలీసుశాఖలో ఎస్సైగా పనిచేస్తున్నాడు. శుక్రవారం కిరాతక లష్కరే తోయిబా ఉగ్రమూక జరిపిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన ఆరుగురు పోలీసుల్లో ఫిరోజ్ అహ్మద్ దార్ ఒక్కరు. ఆయనకు కుటుంబసభ్యులు, పోలీసుశాఖలోని సహోద్యోగులు శుక్రవారం రాత్రి కన్నీటి వీడ్కోలు పలికారు. పుల్వామా జిల్లాలోని డొగ్రిపూర గ్రామంలో ఉన్న తన పూర్వీకుల శ్మశానంలో ఆయనను ఖననం చేశారు. ఈ నేపథ్యంలో 2013 జనవరి 18న అహ్మద్ దార్ రాసిన ఫేస్బుక్ పోస్టు ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది. కలిచివేస్తోంది. ‘ మీరు ఎప్పుడైనా ఒక్కక్షణం ఆగి.. తొలిరాత్రి సమాధిలో ఉన్న మీకేం అవుతుందో.. మిమ్మల్ని మీరు అడిగిచూశారా? మీ శరీరాన్ని శుభ్రంచేసి.. మీ సమాధిని సిద్ధం చేసే క్షణాల గురించి ఆలోచించండి. మిమ్మల్ని ప్రజలు మీ సమాధుల వద్దకు మోసుకెళ్లే రోజు గురించి... మీ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యే రోజు గురించి ఆలోచించండి. మిమ్మల్ని మీ సమాధిలో పూడ్చిపెట్టే క్షణం గురించి ఆలోచించండి’ అని అహ్మాద్ దార్ రాశారు. తొలిరాత్రి సమాధిలో గడిపిన తమ హీరోకు డొగ్రీపూర ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిలో కడతేరిన ఆయనను కడసారి చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన ఇద్దరు కూతుళ్లు ఆరేళ్ల అద్హా, రెండేళ్ల సిమ్రన్ ఒక్కసారిగా తమ ఇంటికి ఇంతజనం ఎందుకొచ్చారో తెలియక అమాయక కన్నుల్లో విస్మయంతో కనిపించారు. ఆయన భార్య ముబీనా అఖ్తర్, వయస్సు ఊడిగిన తల్లిదండ్రులు అహ్మద్ దార్ మృతదేహం వద్ద భోరున విలపించడం చూపరులను కలిచివేసింది. -
‘దర్యాప్తు ఆగలేదు.. కొనసాగుతోంది’
న్యూఢిల్లీ: కశ్మీర్లో రాళ్ల దాడికి పాల్పడుతున్న ఆందోళనకారుల్లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మానవ కవచంగా జీపు బానెట్‌కు కట్టి ప్రశంసా పత్రాన్ని పొందిన మేజర్ నితిన్ గొగోయ్‌పై కేసు దర్యాప్తు కొనసాగుతోందని కశ్మీర్ పోలీసులు స్పష్టం చేశారు. నితిన్ గొగోయ్‌కు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నుంచి ప్రశంసా పూర్వకమైన అవార్డు పొందినంత మాత్రానా దర్యాప్తుపై అవార్డు ప్రభావం పడబోదని మునీర్ ఖాన్ అనే కశ్మీర్ పోలీసు అధికారి చెప్పారు. ‘దర్యాప్తు కొనసాగుతుంది. ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేదు. దర్యాప్తు పూర్తవ్వగానే ఆ వివరాలు తెలియజేస్తాం’ అని ఆయన తెలిపారు. ఎఫ్ఐఆర్ అంటే దర్యాప్తునకు ప్రారంభం అని తర్వాత తర్కంతో కూడిన ముగింపనేది ప్రతి దర్యాప్తునకు ఉంటుందని చెప్పారు. కశ్మీర్లో రాళ్లదాడికి పాల్పడుతున్న ఆందోళనకారుల నుంచి బయటపడేందుకు, పరిస్థితిని సర్దుమణిగేలా చేసి తనతో ఉన్న సైనికులను రక్షించుకునేందుకు మేజర్ నితిన్ గొగోయ్ ఓ ఆందోళన కారుడిని జీపు బానెట్‌కు కట్టి మానవ కవచంగా తీసుకెళ్లారు. ఆయన చేసిన సాహసాన్ని మెచ్చుకుంటూ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నితిన్‌కు ప్రశంసా పత్రం అందజేశారు. -
ఇద్దరిలో ఒకడు దొరికాడు
హంద్వారా: జమ్మూకశ్మీర్ లోని హంద్వారా పట్టణంలో 16 ఏళ్ల బాలికపై వేధింపులకు తెగబడిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. నిందితుడిని హిలాల్ అహ్మద్ బాండేగా గుర్తించారు. అతడిని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ నెల 12న పాఠశాల నుంచి తన స్నేహితురాలితో కలిసి ఇంటికి తిరిగొస్తుండగా ఇద్దరు దుండగులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని బాధిత బాలిక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కు తెలిపింది. తన బ్యాగు కూడా లాక్కుపోయారని వెల్లడించింది. తనపట్ల సైనికులు అనుచితంగా ప్రవర్తించారని వచ్చిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. కాగా, బాలికను సైనికులు వేధించారన్న వందతులు వ్యాపించడంతో స్థానికులు భద్రతా దళాలపై రాళ్లతో దాడి చేశారు. ఆర్మీ బంకర్ ను ధ్వంసం చేశారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా స్పందించి చర్యలు చేపట్టాయి.