శ్రీనగర్ : జమ్ము కశ్మీర్‌లో సోషల్ మీడియాలో ఇష్ఫక్ అహ్ దార్ అనే వ్యక్తి ఫోటో తెగ వైరల్ అవుతోంది. చేతిలో ఏకే 47 తో దర్శనమిచ్చిన అతను తానోక టెర్రరిస్టునన్న విషయాన్ని కింద ఓ సందేశంలో పేర్కొన్నాడు. కానీ, అతను మాత్రం కనిపించకుండా పోయిన ఓ ట్రెయినీ పోలీస్ అన్నది ఇప్పుడు స్పష్టం అయ్యింది.
కశ్మీర్‌లో కొన్ని రోజుల క్రితం ఓ యంగ్ పోలీస్ అధికారి మాయం కావటం కలకలం రేపింది. కతువా జిల్లాలోని ట్రెయినింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్న 24 ఏళ్ల ఇష్ఫక్ అహ్మద్ అహ్మద్ దార్ సెలవులపై ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు. అక్టోబర్ 23వ తేదీనే అతను రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా.. అది జరగకపోవటంతో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు అతని స‍్వగ్రామం హెఫ్ షరిమల్‌కు వెళ్లారు. అయితే అతను ఎప్పుడో ఇంటి నుంచి బయలుదేరాడని చెప్పటంతో వెనక్కి వచ్చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు ఇష్ఫక్ కనిపించటం లేదని పోలీస్ ఫిర్యాదు కూడా చేశారు.
ఈ క్రమంలో ఓ వీడియో విడుదలయ్యింది. అతను పాక్ ఉగ్రప్రేరేపిత సంస్థ లష్కర్-ఇ-తాయిబాలో చేరినట్లు అధికారులు ధృవీకరించారు. అష్ఫక్ ఒక్కడే కాదు గత ఆరు నెలల్లో ఇలా అరడజనుకు పైగానే పోలీసు అధికారులు ఉగ్రవాదం వైపు మళ్లినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment