జనవరిలో ‘ఆర్ట్ ప్రాజెక్టు’
న్యూఢిల్లీ : నగరవాసులకు శుభవార్త. వలస చరిత్ర ప్రారంభ దశను చూడనున్నారు. వలసవాదం-పరిణామాలను ప్రజలకు తెలియజేయడానికి ‘మెట్రో ఆర్ట్’ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. దీని ద్వారా అప్పట్లో మహిళల రక్షణ, పాలనలో పారదర్శకత తదితర అంశాలపై వినోదాత్మక పద్ధతిలో వివరించనున్నారు. మూణ్నెళ్లపాటు కొనసాగే ఈ ప్రాజెక్టును ఢిల్లీ మెట్రో, హెబిటెట్ సెంటర్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా వలసవాదంపై ఫొటో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తారు.‘ జోర్‌బాగ్ మెట్రోస్టేషన్లో ‘ ఉదయ్‌పూర్ పురాతన చరిత్ర’ అనే అంశంపై ఎగ్జిబిషన్, మండీ హౌజ్ మెట్రో స్టేషన్ వద్ద నేరాలపై గ్రాఫిక్స్ ద్వారా పలు అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
ప్రాజెక్టు సంబంధించిన మరిన్ని వివరాలను నిర్వాహకుడు ఆల్కాపాండే తెలిపారు. వలసవాదం కాలం నాటి లింగ వివక్ష, పౌర సమాజం, గుర్తింపు, పాలనలో పారదర్శకత, సమకాలినసమాజంపై ప్రజలకు ప్రాజెక్టు ద్వారా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఉదయ్‌పూర్ చరిత్ర ప్రదర్శనలో 1850 నుంచి ఇప్పటి వరకు వలసలకు సంబంధించిన ఫొటోల ప్రదర్శన ఉంటుంది. ‘ఫొటో గ్రాఫ్‌లు కూడా చరిత్ర జ్ఞానాన్ని అందజేస్తాయి. ఆ కాలం నాటి ప్రజల జీవన విధానం, శక్తి సామర్థ్యాలను ప్రదర్శనలు తెలియజేస్తాయని చెప్పారు.