అర్ధ సంచారజాతులుగా గుర్తించాలి
మోత్కూరు : గొల్ల, కురుమలను అర్థసంచార జాతులుగా గుర్తించాలని గొల్ల, కురుమల ఐక్య కార్యాచరణ రాష్ట్ర కమ్డిఠీ కన్వీనర్ బెల్లి కృష్ణయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మోత్కూరులోని రహదారి బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ పదవుల్లో జనాభా ప్రాతిపదికన కచితమైన వాటా ఇవ్వాలని, ప్రమాదవశాత్తు చనిపోయినవారికి రూ. 6 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. పాల ఉప్పత్తి మరియు, విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో గొల్ల, కురుమలకు 90 శాతం భాగస్వామ్యం కల్పించాలన్నారు. చెరువు, పొరంబోకు, జంగ్లాత్, చెరువుశిఖం భూముల్లో గొర్రెలు మేపుకోవడానికి కనీసం 10 ఎకరాలు పట్టా ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఉన్ని పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు మంజూరు చేయాలని, ఉన్ని ఉత్పత్తులపై శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో గొల్ల, కురుమల జేఏసీ జిల్లా కన్వీనర్ గుండెబోయిన అయోధ్య యాదవ్, మండల కన్వీనర్లు పురుగుల వెంకన్న, ఎలేందర్, ఎంపీటీసీ జంగ శ్రీను, నాయకులు పురుగుల మల్లయ్య, లెంకల వేణు, అవిశెట్టి సుధాకర్, వెంకటనర్సయ్య, మేడబోయిన నరేష్, జంగ నర్సయ్య తదితరులు ఉన్నారు.