artificial earthquake
-
హైడ్రోజన్ బాంబును పరీక్షించాం!
-
హైడ్రోజన్ బాంబును పరీక్షించాం!
ఉత్తరకొరియా 'బాంబు' లాంటి వార్తను పేల్చింది. అణుబాంబు కంటే అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. ఈ ప్రయోగం ప్రభావంతో.. ఈశాన్య ఉత్తరకొరియాలో 5.1 తీవ్రతతో 'కృత్రిమ భూకంపం' సంభవించింది. అంతకుముందు.. అందరూ ఉత్తరకొరియాలో సంభవించింది భూకంపమా.. కృత్రిమ భూకంపమా లేదా అణ్వస్త్ర పరీక్షా అని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా దీనిపై పెద్దస్థాయిలో చర్చ మొదలవ్వడంతో.. చివరకు ఉత్తరకొరియానే అధికారికంగా అసలు విషయాన్ని ప్రకటించింది. ఇటీవలి కాలంలోఅమెరికాను సైతం సవాలు చేస్తున్న ఉత్తరకొరియా.. ఏకంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతవరకు హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ఇదే మొదటిసారి. ఉత్తరకొరియాలోని ఈశాన్య ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ బుధవారం ఉదయం వెల్లడించింది. అక్కడ 2013లో భూగర్భంలో అణు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు అదే స్థలంలో కృత్రిమ భూకంపం వచ్చినట్లు గుర్తించారు. సుంగ్జిబీగమ్ ప్రాంతానికి 19 కిలోమీటర్ల తూర్పు ఈశాన్య దిశలో ఈ భూకంప కేంద్రం ఉంది. ఉత్తరకొరియాలో సంభవించినది భారీ పేలుడు కావచ్చని చైనా భూకంప గుర్తింపు కేంద్రాలు అనుమానిస్తున్నాయి. అది కృత్రిమ భూకంపం అని దక్షిణ కొరియా వాతావరణ శాఖ తెలిపింది. సత్తా చాటేందుకే.. మరో రెండు రోజుల్లో.. అంటే ఈనెల 8వ తేదీన కిమ్ జోంగ్ ఉన్ పుట్టినరోజు ఉండటంతో తమ సత్తాను నిరూపించుకోడానికి, తమవద్ద అణ్వస్త్రాలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్పడానికే ఉత్తరకొరియా ఈ ప్రయోగం చేసిందని భావిస్తున్నారు. -
5.1 తీవ్రతతో 'కృత్రిమ భూకంపం'!
భూకంపాలు సంభవించడం మనకు ఇంతవరకు తెలుసు. కానీ కృత్రిమ భూకంపాల గురించి ఎప్పుడైనా విన్నారా? ఉత్తరకొరియాలో ఇది సంభవించింది. అక్కడ అణుపరీక్షలు నిర్వహించిన స్థలం వద్ద కృత్రిమ భూకంపం వచ్చినట్లు పలు దేశాలకు చెందిన వాతావరణ కేంద్రాలు, భూకంప కేంద్రాలు తెలిపాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైంది. ఉత్తరకొరియాలోని ఈశాన్య ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. అక్కడ 2013లో భూగర్భంలో అణు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు అదే స్థలంలో కృత్రిమ భూకంపం వచ్చినట్లు గుర్తించారు. సుంగ్జిబీగమ్ ప్రాంతానికి 19 కిలోమీటర్ల తూర్పు ఈశాన్య దిశలో ఈ భూకంప కేంద్రం ఉంది. ఉత్తరకొరియాలో సంభవించినది భారీ పేలుడు కావచ్చని చైనా భూకంప గుర్తింపు కేంద్రాలు అనుమానిస్తున్నాయి. అది కృత్రిమ భూకంపం అని దక్షిణ కొరియా వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఉత్తర కొరియా మళ్లీ తాజాగా ఏమైనా అణు పరీక్షలు నిర్వహించిందా.. వాటివల్లే ఇలా కృత్రిమ భూకంపం ఏమైనా సంభవించిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ పరిస్థితి గురించి ఉత్తరకొరియా బుధవారమే ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.