యువ నాటక తరంగం...
ఆదరణ తగ్గుతున్న కళకు అండగా సామాజిక రుగ్మతలే ఇతివృత్తాలుగా... ‘ఉయ్ మూవ్ థియేటర్’తో
{పజల ముందుకు వెండితెర, బుల్లితెరల మధ్య నాటక రంగం నలిగిపోయింది. కోట్ల రూపాయల సెట్టింగుల తళుకుల ముందు నాటకాలనే నమ్ముకున్న కళాకారులు కనిపించకుండా పోయారు. పబ్‌లు, డిస్కోలు, నైట్‌పార్టీలు వీటన్నింటితో గజి‘బిజీ’గా తయారైన నేటి యువతకు ఈనాటి కళలన్నింటికి ఆ నాటక రంగమే ఆసరాగా నిలిచిందన్న నిజం తెలియకుండా పోయింది. అందుకే ప్రస్తుతం ఎక్కడో, ఏ పండక్కో పబ్బానికో తప్ప నాటకాలు కనిపించడం లేదు. ఇక బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో వీ టి ఊసేలేదు. అయితే కళ తగ్గుతున్న నాటకరంగానికి సరికొత్త మెరుగులద్దడానికి నగరంలోని కొంత మంది యువకులు ఉద్యమించారు. వృత్తి పరంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్లుగా స్ధిరపడ్డా ప్రవృత్తిగా నాటకాలను ఎంచుకున్నారు. ఆదరణ తగ్గుతున్న నాటకాలకు ఆసరాగా నిలబడి ‘ఉయ్ మూవ్థియేటర్’ సంస్ధను స్ధాపించారు. ఏడేళ్లుగా నాటక రంగానికి తమ సేవలందిస్తున్న ‘ఉయ్ మూవ్ థియేటర్’ గురించి...
- సాక్షి, బెంగళూరు
కళారంగంపై అభిమానంతో....
బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న అభిషేక్ నరేన్‌కి చిన్నప్పటి నుంచి స్టేజి మీద నటించడం ఇష్టంగా ఉండేది. ఆ ఇష్టం ఆయనతో పాటే పెరిగింది. కాలేజీలో కూడా అనేక నాటకాలు ప్రదర్శించిన అనంతరం సాఫ్ట్వే ర్ ఇంజినీర్‌గా స్ధిరపడ్డారు. అయితే నాటకాలపై ఉన్న మమకా రం తగ్గకపోవడంతో ఏడేళ్ల క్రితం ‘ఉయ్ మూవ్ థియేటర్’ సంస్ధను ప్రారంభించాడు. నాటకాలంటే ఇష్టం ఉన్న అతని స్నే హితులు రంగరాజ్, డాక్టర్ సోహన్ జత కలిశారు. అప్పటి నుంచి వీరు కలిసి సొంతంగా నాటకాలు రాయడం, వాటికి ద ర్శకత్వం వహించడం వంటివి చేస్తూ వస్తున్నారు. వీరి ప్రయత్నం మెచ్చిన యువతీ యువకులు ‘ఉయ్ మూవ్ థియేటర్’ లో చేరారు. ప్రస్తుతం ఈ సంస్థలో 200 మందికి పైగా కళాకారులు నాటక రంగాన్ని నిలబెట్టడం కోసం శ్రమిస్తున్నారు.
స్ఫూర్తిని కలిగించే నాటకాలకే తొలి ప్రాధాన్యం....
ఉయ్ మూవ్ థియేటర్‌ను స్ధాపించిన ఈ ఏడేళ్లలో మొత్తం 50 నాటకాలను ప్రదర్శించారు. వీటన్నింటిలో సామాజిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహనను పెంచే నాటకాలకే సంస్ధ సభ్యులు మొదటి ప్రాధాన్యాన్ని కల్పించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, భూగర్భ జలాలను పెంపొందించడం, వరకట్న దురాచారం వంటి వాటన్నింటి పై ఉయ్ మూవ్ థియేటర్ సభ్యులు నాటకాలను ప్రదర్శిం చారు. వీరు ప్రదర్శించిన నాటకాల్లో ‘మాల్గుడి డేస్’కి ఎక్కువ జనాదరణ లభించింది. అంతేకాదు నగర జీవితంలోని ఆధునిక పోకడలు, తద్వారా కలుగుతున్న నష్టాలను వివరించేలా వీరు రూపొందించిన ‘నమ్మ మెట్రో ఫేజ్-2’ నాటిక సైతం ఎంతో ప్రజాదరణను పొందింది. ఇక మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వరకట్న దురాచారానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గాను వీధి నాటికలను (స్ట్రీట్ప్లే) సైతం ‘ఉయ్ మూవ్ థియేటర్’ సభ్యులు ప్రదర్శిస్తున్నారు. ఇదిలాఉండగా ఇప్పుడిప్పుడే కాఫీడే వంటి కార్పొరేట్ సంస్థలు వీకెండ్లో ఈ సంస్థ ద్వారా ప్రదర్శనలు ఇప్పి స్తూ తమ వినియోగదారులకు మనోరంజకాన్ని కలిగిస్తున్నాయి.
అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి...
ఓ మహాయజ్ఞంలా నాటకాలను ప్రదర్శిస్తున్న ‘ఉయ్ మూవ్ థియేటర్’ సభ్యులను ఎన్నో అవార్డులు, రివార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఓ నాటక రంగ సంస్థ ‘షార్ట్, స్వీట్ థియేటర్ ఫెస్టివల్’ పేరుతో నిర్వహించిన నాటకాల పోటీల్లో ‘బెస్ట్ ఇండిపెండెంట్ థియేటర్ కంపెనీ’ అవార్డును ఈ సంస్ధ సొంతం చేసుకుంది. ఇంగ్లీష్ నవల ఆధారంగా రూపొందిన ‘మిర్రర్ మిర్రర్’ నాటకాన్ని సైతం భారతదేశంలో మొట్టమొదటి సారిగా ప్రదర్శించిన ఘనత ఈ సంస్థకే దక్కుతుంది. మనలోని మంచి చెడులను అద్దం మనకు తెలియజెబితే ఎలా ఉంటుంది అన్న ఊహ తో రూపకల్పన చేసినదే మిర్రర్ మిర్రర్. ఈ నాటకానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులెన్నో లభించాయి.
ప్రొడక్షన్ ఖర్చుకు మాత్రమే వసూలు
‘నాటక రంగంపై ఉన్న మక్కువతోనే ఈ సంస్ధను ప్రారంభిం చాను తప్ప వాణిజ్య పరంగా ఏదో లాభపడాలని కాదు. అం దుకే మా నాటకాలకు అయ్యే ప్రొడక్షన్ ఖర్చుకు సరిపోయేం త మొత్తాన్ని మాత్రమే టికెట్ల రూపంలో వసూలు చేస్తాం. ఒక్కొసారి మా టీం సభ్యులమే కాక కొంతమంది ఫుల్‌టైమ్ నటులను కూడా మా ప్రదర్శనల కోసం పిలుస్తుంటాం. వారి కి అవసరమైన ఖర్చులను కూడా ప్రొడక్షన్ మొత్తం నుంచే భరి స్తాం. అందుకే మేం ప్రదర్శించే నాటకాలకు సంబంధించిన టికెట్ ధర నామమాత్రంగా ఉంటుంది. ఆనాటి కళ ఎన్నటికీ మరుగుపడిపోకూడదన్నదే మా ఆశయం.’
- రంగరాజ్, ‘ఉయ్ మూవ్ థియేటర్’
వ్యవస్థాపకృబంద సభ్యుడు
నాటక రంగంపై ఆసక్తి ఉండి ‘ఉయ్ మూవ్ థియేటర్’లో సభ్యులుగా చేరాలనుకునే వారు www.wemovetheatre.in,
register@-wemovetheatre.in లలో లాగిన్ అయి వివరాలను తెలుసుకోవచ్చు.