Arts college ground
-
రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ప్రతిహామీని నెరవేరుస్తాం: రాహుల్
TIME: 08: 10PM తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తుపై రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తుపెట్టుకోదని స్పష్టం చేశారు. తెలంగాణను దోచుకున్న వారితో పొత్తులుండవ్ అని తెలిపారు. పొత్తు గురించి కాంగ్రెస్ నేతలు ఎవరు మాట్లాడినా పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్తో పొత్తు కొరుకునే కాంగ్రెస్ నేతలు ఎవరైనా టీఆర్ఎస్లోకి వెళ్లి పొవచ్చని అన్నారు. ఇక వరంగల్ సభా వేదికగా సొంత పార్టీ నేతలకు రాహుల్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ విధానాలు విమర్శిస్తే సహించేది లేదని, ఎంత పెద్ద వారైనా పార్టీ నుంచి బయటకు నెట్టేస్తామని హెచ్చరించారు. ప్రజా సేవ చేస్తున్న వారికే టికెట్లు ఇస్తామని తెలిపారు. TIME: 08: 00PM తెలంగాణ సీఎం రైతుల కష్టాలు వినట్లేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడలేదని, రాష్ట్రంలో రాజరికం నడుస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రైతుల బాధ వినడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ రైతులు ఆందోళన చెందవద్దని, అధికారంలోకి వచ్చాక రూ 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఇవి ఒట్టిమాటలు కావు, తెలంగాణ కలలు నెరవేర్చే మొదటి అడుగని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందని గుర్తు చేశారు. రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ప్రతిహామీని నెరవేరుస్తాం ‘తెలంగాణలో నడుస్తోంది బీజేపీ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం. తెలంగాణలో బీజేపీ గెలవలేక ఇలా చేస్తోంది. టీఆర్ఎస్ ఎంత దోచుకున్నా.. ఈడీ లేదు, ఐటీ లేదు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు రాలేదు. ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిది? తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న దొంగ ఎవరు? కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చాం. తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు.. రాజు ఉన్నాడు. తెలంగాణ ఇస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందనుకున్నాం. రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ప్రతిహామీని నెరవేరుస్తాం’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. TIME: 07: 45PM తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్లనో రాలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఒక్కరి కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని అన్నారు. తెలంగాణ వల్ల ఒకే కుటుంబం బాగుపడిందన్నారు. ఎంతోమంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు.. ఈ వేదిక మీద భర్తల్ని పోగొట్టుకున్న రైతు కుటుంబాలు ఉన్నాయని, వీరి వేదనకు ఎవరు కారణమని ప్రశ్నించారు. ఇటువంటి బాధిత రైతులు రాష్ట్రమంతా ఉన్నారన్నారని, తెలంగాణ కల సాకారం చేసుకోవడానికి రక్తాన్ని, కన్నీళ్లను చిందించారని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజల కలను నెరవేర్చింది కాంగ్రెస్‌యేనని స్పష్టం చేశారు. TIME: 07: 30PM టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ ప్రకటించారు. తెలంగాణ అంటే పేగు బంధం.. ఆత్మ గౌరవమని పేర్కొన్నారు. తెలంగాణ అంటే ఎన్నికల ముడి సరుకు కాదని అన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా, చేసే వారిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. ‘అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెస్తాం. ఏటా కౌలు రైతులకు 15 వేల ఆర్థిక సాయం. భూమి లేని రైతులకు రూ. 12 వేల సాయం. అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇస్తాం. ఆదివాసీలకు పోడు భూముల్లో హక్కు పట్టాలిస్తాం. రైతు పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.. TIME: 07: 10PM కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా దోపిడీకి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతు బంధు పేరు చెప్పి అన్నింటినీ బంద్ చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్కు బుద్ధిచెప్పడం కోసమే ఈ సభా అని అన్నారు. రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మోదీ వల్ల రైతుల ఆదాయం తగ్గిపోయందన్నారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇది తొలిమెట్టు అని అన్నారు. TIME: 06: 50PM వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభా వేదిక వద్దకు రాహుల్ గాంధీ చేరుకున్నారు. రాహుల్‌కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ పరామర్శించారు. TIME: 06: 20PM ► కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ చేరుకున్నారు. రాహుల్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్ చేరుకున్నారు. TIME: 05: 30PM కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాహుల్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘన స్వగతం పలికారు. అనంతరం శంషాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్‌కు బయల్దేరారు. మొదట వరంగల్ గాబ్రియల్‌కు స్కూల్ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్‌జీపులో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌కు వెళ్లనున్నారు. సాయంత్ర 7 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. వరంగల్‌లో సభ ముగిసిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ పయనం కానున్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ సభలో రైతు డిక్లరేషన్‌పై రాహుల్ గాంధీ ప్రకటన చేస్తారని తెలిపారు. తెలంగాణలో కొత్త వ్యవసాయ విధానంపై డిక్లరేషన్ ఉండబోతోందని పేర్కొన్నారు. అయితే రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించనున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అదే విధంగా రాహుల్ గాంధీ టీ కాంగ్రెస్‌కు ఏ విధంగా దిశానిర్ధేశం చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యువత, రైతులే ప్రధాన కేంద్రంగా ఈ సభ జరగనుంది. రాహుల్ రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్శ్రేణులు వేలాదిగా తరలి వెళ్తున్నారు. టీ కాంగ్రెస్ నేతలు సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం, మెదక్, నల్లగొండ, కరీంనగర్ నుంచి భారీగా తరలి వస్తున్నార. నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు వేల వాహనాల్లో జనాన్ని తరలిస్తున్నారు. చదవండి: రాహుల్ తెలంగాణ టూర్లో మరో షాక్ -
బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్ అమలు చేయాలి సామాజిక హక్కుల వేదిక నేతలు అనంతపురం న్యూటౌన్ : బడుగు బలహీన వర్గాల వారి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రతి కులానికి కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధి కోసం పాటుపడాలని సామాజిక హక్కుల వేదిక నేతలు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో పలు కుల సంఘాల వారు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. లింగమయ్య సభా«ధ్యక్షతన జరిగిన సమావేశంలో వేదిక గౌరవాధ్యక్షులు నాగభూషణం, అధ్యక్షుడు జగదీశ్, ప్రధాన కార్యదర్శి రమేశ్‌గౌడ్, నాయకులు నదీం అహ్మద్, జాఫర్, తిరుపాల్, దాదా గాంధీ, సాలార్‌బాషా, మాజీ న్యాయమూర్తి క్రిష్టప్ప, కేశవనాయక్, మాజీ మునిసిపల్ చైర్మన్ నూర్ మహ్మద్, ముస్లిం మైనార్టీ నాయకులు హక్, ఖలీలుల్లాఖాన్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ల ఐక్యతను వెలుగెత్తి చాటేందుకు తొలిసారి ఐక్యవేదికగా సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. రిజర్వేషన్లకు మంగళం పాడాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని, ప్రభుత్వ రంగంలో మాదిరిగానే ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన కులానికో అసెంబ్లీ సీటు కేటాయించాలని డిమాండు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపులు జరగకపోతే సామాజిక హక్కుల వేదిక తరఫున ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతామన్నారు. విడివిడిగా పోరాడితే సమస్యలు పరిష్కారం కావన్న ఉద్దేశ్యంతోనే సామాజిక హక్కుల వేదికను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. త్వరలో అన్ని డివిజన్లలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ముస్లింలు వెనుకబడి ఉన్నారని, ఈ విషయాన్ని పలు కమిషన్లు స్పష్టం చేసినా ఫలితం లేకుండాపోతోందన్నారు. దళితుల కన్నా దరిద్రమైన జీవితాన్ని ముస్లింలు గడుపుతున్నట్లు ముస్లిం నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెబుతున్నా నిధులు మాత్రం కేటాయించడం లేదని ఆరోపించారు. సీపీఐ రామకృష్ణ నేతృత్వంలో ప్రజల్లో చైతన్యం తేవడం కోసం, తమ హక్కుల సాధన కోసం జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు యాత్ర సాగుతుందన్నారు. అంతకు ముందు పలు కులసంఘాల ప్రతినిధులు తమ సంస్కృతిని చాటే కళారూపాలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మీసాల రంగన్న, పాస్టర్ ఐజయ్య, యాదవ సంఘం నరసింహులు, రజక సంఘం ప్రసాద్, ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షులు మహబూబ్‌బాషా, ఎంఎండీఏ రాష్ట్ర అధ్యక్షులు ఇమామ్ తదితరులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమస్యలపై మాట్లాడారు. -
చిరంజీవిని చూసేందుకే వచ్చారు
కాంగ్రెస్ సభకు హాజరైన విద్యార్థులు పరీక్ష రాసేసి అటుగా వచ్చారు అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు విద్యార్థులే అధికంగా హాజరయ్యారు. సభా వేదికకు సమీపంలోని ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ, జూనియర్ కళాశాలలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. సమావేశం ప్రారంభమయ్యే సమయానికి పరీక్ష పూర్తి కావడంతో, విద్యార్థులందరూ నేరుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభలో నేతలు ప్రసంగిస్తుండగా వద్దు వద్దంటూ కేకలు వేశారు. చిరంజీవి పేరును ఉచ్ఛరించినప్పుడల్లా కేకలు వేసిన విద్యార్థులు, ఆయనను మాట్లాడించాలని డిమాండ్ చేశారు. చిరంజీవి ప్రసంగించే సమయంలో పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. చివరికి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ చిరంజీవిని ఎంత సేపు మీ ముందు ఉంచాలో మీరే చెప్పండి. ఆయన ముందు మాట్లాడితే సభ ముగిసిపోతుంది. ఆయన వెళ్లి పోతారు. అలా కాకుండా మీరు ఆయనను ఎక్కువ సేపు చూడాలనుకుంటే మా అందరి తరువాత చివరలో మాట్లాడతారు. అలాగైతే మీరు ఆయనను ఎక్కువ సేపు చూసే అవకాశం ఉంటుందని చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించారు. పరీక్ష వేళలో... కాంగ్రెస్ సభ డిగ్రీ విద్యార్థులకు 11 గంటల వరకూ, పదవ తరగతి విద్యార్థులకు 12 గంటల వరకు పరీక్షలు జరుగుతుండగా గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్‌పార్టీ సభ ఏర్పాటు చేసింది. సభా వేదికకు ఒకవైపున డిగ్రీ పరీక్ష కేంద్రమైన ఆర్ట్స్ కళాశాల, సభకు ఎదురుగా పదవ తరగతి పరీక్షా కేంద్రమైన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సభా ప్రాంగణంలో హడావుడి మొదలైంది. భారీ స్పీకర్లు ఏర్పాటు చేసి పాటలు వినిపించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. మైకుల హోరుకు సరిగ్గా పరీక్ష రాయలేకపోయామని, అటుగా వచ్చిన పలువురు విద్యార్థులు బాధపడ్డారు. -
తెలంగాణ సంస్కృతిని చాటేందుకే..
కరీంనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకే జాగృతి ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాలుగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మంగళవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాగృతి జిల్లా కన్వీనర్ బాలసంకుల అనంతరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, బతుకమ్మ, దసరా, దీపావళి, పీరీల పండుగ, హోలి లాంటి పండుగల్లో ఇంటిల్లిపాది ఆడపడుచులంతా పాల్గొని చేసుకునే సంస్కృతీ తెలంగాణదని అన్నారు. సీమాంధ్రలో ఒక్క సంక్రాంతి పండుగను మాత్రమే ఘనంగా నిర్వహించుకుంటారని, పండుగల ప్రాముఖ్యత వారికి తెలియదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగాక సంస్కృతీ సాంప్రదాయలకు పెద్దపీట వేసేలా రాష్ట్ర పునర్నిర్మాణంలో జాగృతి ప్రముఖపాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నల్లికుట్లోడని, సీమాంధ్రలో జరిగే ఉద్యమం ఆయన సృష్టించిందేనని మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి వెల్లడించడం సీఎం ఎంతటి ప్రమాదకారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్టీఆర్ హయాంలో తెలంగాణలోని భూములు అమ్మి ఢిల్లీలో ఏపీ భవన్‌ను నిర్మించారని, తెలంగాణ ఆస్తులనమ్మి నిర్మించిన ఆ తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా చంద్రబాబు దీక్షకు పూనడం అనైతికమని, వెంటనే ఏపీ భవన్ ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. బంగారు బతుకమ్మ వేడుకల విజయవంతానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ జి.వివేక్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు రవీందర్‌సింగ్, తెలంగాణ జాగృతి ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కన్వీనర్ తానిపర్తి తిరుపతిరావు, జిల్లా అధికారప్రతినిధి జాడి శ్రీనివాస్, యువజన, విద్యార్థి, మహిళా, ఆరోగ్య విభాగాల కన్వీనర్లు వంగల శ్రీనివాస్, పసుల చరణ్, శ్రీనివాస్‌కర్ణ, జవ్వాజి విమల, బుక్‌క్లబ్ రాష్ట్ర కన్వీనర్ నంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.