శ్రీశైలంలో ఆరుద్రోత్సవం: భక్తుల రద్దీ
శ్రీశైలం: శ్రీశైలంలో భక్తుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. రద్దీ కారణంగా ప్రాత: కాల పూజా టికెట్లను నిలిపివేశారు. మల్లన్న జన్మ నక్షత్రన్ని పురస్కరించుకుని ఈరోజు ఆరుద్రోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్సవం నేపథ్యంలో వేకువజామున సుప్రభాత సేవ, మహా మంగళహారతులను ఏకాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజల అనంతరం నందివాహనంపై ఉత్సవ మూర్తులను గంగాధ మండపం వద్దకు చేర్చి, అక్కడ నుంచి గ్రామోత్సవం ప్రారంభిస్తారు.