జియోనీ సరికొత్త స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ జియోనీ ఎస్ సిరీస్ లో మరో కొత్త 4జీ స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది. వినియోగదారులకు వర్చువల్ రియాలిటీ ఫీచర్ అనుభవం అందించేందుకు ఎస్ 6 ప్రో పేరుతో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇందులో జీయోనీ వీఆర్ యాప్ ముందుగానే లోడ్ చేసి ఉంటుంది.
గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ స్టైల్, ఫర్మార్మేషన్స్ మేలు కలయికగా జీయోనీ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ ఆర్. వొహ్రా పేర్కొన్నారు. అర్బన్ సెల్ఫీ జనరేషన్ కోసం ప్రత్యేకంగా దీన్ని తయారుచేసినట్టు వెల్లడించారు. వీడియో ఎడిటర్, డెస్క్ టాప్ ఎడిటర్, ఇమేజ్ ప్లస్, వీడియో బ్యూటిఫికేషన్, టైమ్స్ లాప్స్, టెక్ట్స్ రికగ్నైజేషన్ వంటి ఫీచర్లు పొందుపరిచారు. అక్టోబర్ 1 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దీంతో పాటు వర్చువల్ రియాలిటీ హ్యాండ్ సెట్(రూ.2,499) కూడా విడుదల చేసింది.
జియోనీ ఎస్ 6 ప్రో ఫీచర్లు
5.50 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే
1.8 గిగా హెడ్జ్ ప్రాసెసర్
1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్
ఆండ్రాయిడ్ మార్ష్ మాలో 6.0 ఓఎస్
4 జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
13 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
ఫింగర్ ప్రింట్ స్కానర్
3130 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర రూ. 23,999