Asadhamasam
-
ఇంద్రకీలాద్రి: భక్తుల కోలాహలం.. దుర్గమ్మకు ఆషాఢం సారె
-
ఆషాడ మాసం: గోరింటాకు పెట్టుకోవడం వెనకున్న ఆంతర్యం ఇదే..
సాక్షి, మహబూబ్‌నగర్: ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆషాఢమాసం నేటి (గురువారం) నుంచి ప్రారంభం అయ్యిందది. ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే ఆషాఢమాసం వర్ష రుతువులో గోరింటాకు పెట్టుకుంటే చర్మవ్యాధుల బారి నుంచి రక్షణ పొందవచ్చనేది ఆరోగ్య రహస్యం. అందుకే ఈ మాసంలో వానలు ఎక్కువై ఇంటి లోగిళ్లు, పంట పొలాలు బురదమయమై, క్రిమి కీటకాలు పెరుగుతాయి. మహిళలు వాటిలో కాళ్లు, చేతులు ఆడిస్తూ పనిచేయడం పరిపాటి. కాబట్టి చర్మ రోగాలు దరిచేరకుండా గోరింటాకును పెట్టుకునే వారు. ప్రస్తుతం రకరకాల మెహందీ డిజైన్లు వాడుకలోకి రావడం వల్ల అందం కోసం గోరింటాకును మహిళలు అలంకరించుకోవడం అధికమై, కాలక్రమేణ పట్టణ ప్రాంతాల్లో వేడుకలు చేసుకోవడం ఆచారంగా మారింది. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక పలు శాస్త్రీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గోరింటాకు వల్ల గోళ్లకు అందం రావడమేకాక, గోరుచుట్ట వంటివి రాకుండా ఉంటాయి. ఈ మాసం సందర్భంగా కొన్నిచోట్ల మహిళా సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో మహిళలంతా సామూహికంగా గోరింటాకు వేడుకలు నిర్వహిస్తారు. పండుగలకు ప్రత్యేకం ఆషాఢం పండుగలకు ఆషాఢం ప్రత్యేకతగా చెప్పవచ్చు. వచ్చేనెల 10వ తేదీన శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి), 12వ తేదీన గురుపౌర్ణమి (ఆషాడ పౌర్ణమి) పండుగలు రానున్నాయి. ఆషాఢ మాసంలో బోనాల వేడుకలను జరుపుకుంటారు. గ్రామ దేవతలకు బోనాలతో మొక్కులు సమర్పిస్తారు. ఆషాఢ శుద్ధ పాఢ్యమి నుంచి బహుళ అమావాస్య వరకు బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. -
ఆషాఢమాసం ఆరంభం.. శుభముహూర్తాలకు బ్రేక్.. అప్పటి వరకు ఆగాల్సిందే!
సాక్షి, కరీంనగర్: మూఢాలు వచ్చేశాయి.. శుభ మహూర్తాలకు బ్రేక్ పడింది. మంగళవారం నుంచి ఆషాఢమాసం ప్రవేశించడంతో ముహూర్తాలు లేవు. మూడు నెలలుగా జిల్లాలో కొనుగోలు దారులతో కళకళలాడిన పెళ్లి సామగ్రి దుకాణాలు బోసిపోనున్నాయి. పెళ్లి మండపాలు, ప్రింటింగ్ప్రెస్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, వంటవారు, భజాభజంత్రీలు, నాదస్వరం, పురోహితులు నెల రోజుల పాటు ఆగస్టు 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. వ్యాపార వర్గాల్లో గుబులు ఆషాఢ మాసంతో శుభముహూర్తాలు లేక తమ వ్యాపారాలు ఎలా సాగుతాయోనని వ్యాపారవర్గాల్లో గుబులు పట్టుకుంది. వానాకాలం రైతుల సీజన్ కూడా కావడంతో రైతులు పొలం పనుల్లో ఉండి తమ అవసరాలను వాయిదా వేసుకుంటారని, అత్యవసరమైతే అది కూడా నిత్యావసరలకే తప్పా అనవసరంగా ఏమి కొనుగోలు చేయరని వ్యాపార వర్గాలు వాపోతున్నాయి. నెల రోజులు ఉపాధి బంద్ పెళ్లిళ్లు, ఇతర శుభకార్యక్రమాలపై ఆధారపడిన వారు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్లో సంపాదించుకున్న వాటిలో నుంచే నిత్యావసరాలకు ఖర్చు చేయాల్సిందేనని వాపోతున్నారు. చదవండి: Hyderabad: అజయ్‌తో పరిచయం.. సహజీవనం ముసుగులో చిన్నారుల కిడ్నాప్ ఆగస్టు 3 నుంచి ముహూర్తాలు ఆషాఢ మాసంతో జూలైలో ముహూర్తాలు లేవు. తిరిగి ఆగస్టు 3 నుంచి శుభముహూర్తాలున్నాయి. అవి కూడా కేవలం 10 రోజులే. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో శుక్రమూఢం ఉంటుంది. ఈ మూడు నెలలు శుభముహూర్తాలు ఉండవు. మళ్లీ డిసెంబర్లో 10 మంచి రోజులు తర్వాత ధనుర్మాసం ప్రారంభమవుతుంది. – పవనకృష్ణశర్మ, ప్రధానార్చకులు, దుర్గాభవానీ ఆలయం, నగునూర్, కరీంనగర్ ఉపాధి ఉండదు శుభకార్యక్రమాలపై ఆధారపడ్డ వారికి ఆషాఢంలో ఉపాధి ఉండదు. మొన్నటి వరకు జరిగిన శుభకార్యక్రమాల్లో అంతో ఇంతో సంపాదించుకుంటే వాటి నుంచి అత్యవసరాలకు ఖర్చు చేసుకుని ముహూర్తాల కోసం వేచి ఉండాలి. – గోగుల ప్రసాద్, ఈవెంట్ ఆర్గనైజర్, కరీంనగర్ -
ఆషాఢం: కొత్త దంపతులకు దూరం ఎందుకంటే..?
ఆషాఢ మాసం.. ఎంతో విశిష్టం.. ఏకాదశి, గురుపౌర్ణమి, చాతుర్మాస వ్రతాలు.. పూరీలో జగన్నాథుని రథయాత్ర.. ఇలా ఎన్నో పండుగలు.. మరెన్నో ప్రత్యేకతలు దీని సొంతం.. అయితే నవదంపతులకు మాత్రం భారం.. కోటి ఆశలతో ఒక్కటైన జంటకు నెలపాటు ఎడబాటు.. అయితే ‘సెల్’మోహన రంగా అంటూ.. విరహగీతం ఆలపిస్తారు.. వీడియో కాలింగ్‌లో విహరిస్తారు. ప్రణయ మధురిమలు పంచుకుంటారు.. సరాగాల సరిగమలు పెంచుకుంటారు.. శ్రావణం రావాలి అంటూ నిరీక్షిస్తూ ఉంటారు. సాక్షి, కడప : ఈనెల 11వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలైంది. ఈ మాసాన్ని శూన్యమాసమంటారు. వివాహం లాంటి శుభకార్యాలు తలపెట్టరు. ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి వైష్ణవ ఆరాధకులకు ముఖ్యమైనది. దీన్నే తొలి ఏకాదశి అంటారు. అప్పటి నుంచి ప్రతి వారం ఏదో ఒక పండుగ, వ్రతం, పూజ ఉంటాయి. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు. ► ఆషాఢమాసంలో యువతులు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని పెద్దలు పేర్కొంటారు. గోరింటాకుకు మన సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ► ఆషాఢ పౌర్ణమిని మనం వేద వ్యాసుని పేరిట గురుపౌర్ణమిగానిర్వహించుకుంటాం. ► తెలంగాణలో బోనాల పండుగను నిర్వహిస్తారు. వర్షాల కారణంగా కూరగాయలు బాగా పండుతాయి.. శ్రీ దుర్గామాతను శాకంబరిగా అలంకరించి తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహిస్తారు. ► ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర కూడా ఈ మాసంలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వధూవరుల విరహం.. ఆషాఢ మాసంలో అత్తాకోడళ్లు ఒక ఇంటిలో ఉండకూడదంటారు. కొత్తగా పెళ్లయిన దంపతులను దూరంగా ఉంచుతారు. ఇందులో భాగంగా అమ్మాయిని పుట్టింటికి తీసుకు వెళతారు. ఇందులో శాస్త్రీయత ఉందని పెద్దలు పేర్కొంటున్నారు. ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత వేసవి కాలంలో ప్రసవించే అవకాశం ఉందని, అప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి శిశువుకు ఆ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుందని.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, తల్లీబిడ్డల ఆరోగ్యానికి కూడా ఈ వాతావరణం మంచిది కాదంటారు. అందుకే ఆ మాసంలో నూతన దంపతులను దూరంగా ఉంచుతారు. కొత్త కోడలు పుట్టింటికి... ఈ మాసంలో తొలకరి మొదలై మంచి వర్షాలు కురుస్తాయి. పొలం పనులు జోరందుకుంటాయి. ఇంటిలో అందరూ వ్యవసాయ పనులపై పొలానికి వెళ్లినపుడు కొత్తగా పెళ్లయిన జంట ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. అందుకే సంప్రదాయం పేరిట కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే. ఎందుకిలా.. ఆషాఢం మొదలయ్యే నాటికి వర్షాలు కురిసి కొత్త నీరు వస్తుంది. మారుతున్న వాతావరణంలో అనుకూల, ప్రతికూల మార్పులను తట్టుకుని నిలవాలన్నదే ఈ మాసం సందేశం. కొత్త జంటలలో అమ్మాయి ఈ మాసంలో అత్తగారింట్లో ఉండకూడదన్న సంప్రదాయం బాగా ప్రచారంలో ఉంది. శారీరకంగా, మానసికంగా అప్పుడప్పుడే భర్తకు దగ్గరవుతున్న వారు ఈ ఎడబాటు ద్వారా కలిగే ప్రేమ వారి భవిష్య జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందంటారు. ఈ మాసం నూతన జంటలను కొన్నాళ్లపాటు విడదీసి విరహంలో ముంచుతుందని మాత్రమే భావించాల్సిన అవసరం లేదు. వారి మధ్య బంధాన్ని మరింతగా బలపరుస్తుందన్న అవగాహన కలిగి ఉండాలి. ఆధునిక టెక్నాలజి కారణంగా సెల్ఫోన్లలో ఎక్కువగా మాట్లాడుకునేందుకు ఇప్పుడు వీలుంది. నెలరోజుల తర్వాత అంటే శ్రావణమాసంలో మెట్టినింటివారు అమ్మాయికి చీర, సారె పెట్టి ఆశీర్వదించి మంగళ ప్రదంగా తమ ఇంటికి తీసుకు వస్తారు. ఇక్కడితో ఆషాడ మాసపు ఎడబాటు ముగుస్తుంది. అయితే ఈ ఆధునిక కాలపు ఉద్యోగం చేసే జంటకు విరహం, బాధ ఉండదు. వివాహమైన నెలరోజులకే ఉద్యోగం చేసే చోట కొత్త కాపురం పెట్టేస్తుండడంతో అత్తాకోడలు ఒకే ఇంటిలో ఉండే నిబంధన వారికి వర్తించదు. చాతుర్మాస దీక్షలు చేపడతారు.. ఆషాఢాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభ కార్యాలు చేయకూడదని విశ్వసిస్తారు. నిజానికి పెద్ద పండుగల రాకను ఈ మాసం తెలుపుతుంది. వైష్ణవులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. మఠాధిపతులు ఈ మాసంలోనే చాతుర్మాస దీక్ష వహిస్తారు. – విజయ్‌భట్టర్, అర్చక సంఘం నాయకుడు, కడప ఎన్నో ప్రత్యేకతలు.. ఆషాఢ మాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అత్తాకోడళ్లు ఈ మాసంలో ఒకే ఇంటిలో ఉండకూడదని భావిస్తారు. నిజానికి ఈ నమ్మకం వెనుక ప్రకృతి ఆధారిత సంప్రదాయం ఉంది. దాదాపు అన్ని పండుగల వెనుక ప్రకృతి పరమైన లేదా ఆధ్యాతి్మక, పురాణ పరమైన విశ్వాసాలు ఉంటాయి. – హరిభూషణరావు, లైబ్రేరియన్, కడప -
అక్కడమ్మాయి... ఇక్కడబ్బాయి
సాక్షి, ఖమ్మం : ఉరిమే మేఘాలు ఒళ్లు జలదరింపజేస్తాయి. మెరిసే మెరుపులు భయకంపితులను చేస్తాయి. ఉరుమూ, మెరుపుల కలయికలో కురిసే చినుకులు మాత్రం మేనుకు కొత్త హాయినిస్తాయి. తోడుగా నిలవాల్సిన సహచరి సాన్నిహిత్యం ఉంటే ఆ హాయి ఆనందాన్నిస్తుంది. కొత్త దంపతులకు ఈ రకమైన పరిసరాలు ఉత్తేజాన్నిస్తాయి. కానీ ఏం లాభం.. చూసుకోవడానికి కూడా వీలు లేకుండా కఠిన నిబంధనలు.. కలుసుకుంటే కలిగే విపరిణామాల గురించి ఎన్నో అనుమానాలు. నిజంకాకపోయి ఉంటే బాగుండేదన్న తలంపులు. పదే పదే గుర్తొచ్చే భాగస్వామి(ని). అయినా కుదరదంటే కుదరదంతే..అనే పెద్ద వాళ్ల ఆంక్షలు.. కాంక్షలున్న చోట ఆంక్షలు ఎలా నిలుస్తాయనే కుర్రకారు ఆలోచనలు. వెరసి ఆషాఢమాసం నవ దంపతులకు ఎడబాటు తప్పదు. ఈ నేపథ్యంలో నూతనజంటను ఆషాఢంలో విడిగా ఎందుకుంచాలంటే.. బంధం బలోపేతం.. ఆషాఢ మాసంలోని నెల రోజుల పాటు పెళ్లయిన కొత్త జంట మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఆ దంపతుల మధ్య అనురాగాన్ని చిగురింపజేస్తుంది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి, ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ చూసి నిర్ధారించిన వివాహాల్లో దంపతుల వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు అంతగా ప్రాధాన్యత లేకుండేది. ఈ ఆషాఢ మాసం ఎడబాటు కారణంగా వ్యక్తిగత అభిరుచులు, అభిప్రాయాలు మరింత బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యామ్నాయాలు బోలెడు.. ఎడబాటు కొత్త జంటకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ప్రస్తుత ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు ఎడబాటు భావనను దూరం చేస్తున్నాయి. సెల్‌ఫోన్ వచ్చాక మనుషుల మధ్య మానసికంగా దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఎస్ఎంఎస్లు, వాట్సప్‌లు, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పర సందేశాలు ఎలాగూ మార్చుకునే సౌకర్యం ఉండనే ఉంది. తమ విరహాగ్ని చల్లార్చు కునే పలు రకాల ప్రత్యామ్నాయాలకు కొదవేం లేదు. అభిప్రాయాలు, స్వీట్ నథింగ్స్ షేర్ చేసుకుంటూ కాలాన్ని సులువుగా గడిపేయొచ్చు. శాస్త్రీయ కోణంలోనూ... మంచిదే నవ దంపతులు ఆషాఢ మాసంలో విడిగా ఉండాలనే నియమం ఏనాటి నుంచో వస్తోంది. పూర్వం రోజుల్లో కొత్తగా పెళ్లయిన యువకులు ఆరు నెలల పాటు అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. శ్రమించే సమయంలో ఆరునెలల పాటు అత్తవారింట్లో కూర్చుని ఉంటే జరగాల్సిన పనులు స్తంభించిపోతాయి. నవ దంపతులు ఒకే గూటిలో ఉండడం అంత మంచిది కాదని ఎందుకంటారంటే.. ఈ సమయంలో ఒక వేళ గర్భధారణ జరగడం తల్లి, బిడ్డలకు అంత క్షేమకరం కాదు. ఆషాఢ మాసంలో కురిసే వర్షాలు, వరదల కారణంగా సమీప జలాశయాలతోపాటు పరిసరాల్లోని నీళ్లుకలుషితం అవుతాయి. కలుషిత నీటిని వినియోగించినా అనారోగ్యాలు ప్రబలే అవకాశాలున్నాయి. చలిజ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు విస్తరించే ప్రమాదం ఉంటుంది. చీడ, పీడలు జనించే సమయంలో అనారోగ్య రోజులు, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రవచనం. ఇపుడు గర్భధారణ జరిగితే ప్రసవ సమయం వచ్చే ఎండాకాలంలో ఉంటుంది. తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే వేసవి సమయం జన్మించే శిశువు బాహ్య పరిసరాలు, ఉష్ణోగ్రతను భరించే స్థితిలో ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఒక్క ఆషాఢ మాసంలో దంపతులు వియోగం పాటిస్తే సంతానోత్పత్తి సమయాన్ని జూన్, జూలై వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతల కారణంగా సుఖ ప్రసవానికి అనుకూలంగా ఉంటుంది. శిశువు సైతం తన నూతన పరిసరాలకు సులువుగా అలవాటు పడతాడు. ఈ శాస్త్రీయ నేపథ్యంలో కొత్త జంటకు ఎడబాటును అనివార్యమని పెద్దలు నిర్ణయించారు. ఎడబాటు ఎందుకంటే..? కొత్త కోడలు తన అత్తను చూడకూడదు. అల్లుడు అత్త వారింటి గడప దాటకూడదు అనే నిబంధనలు మానవ సమాజంలో తరచూ వినపించేవే. కోడలు, అత్త ఒకరినొకరు చూసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమీలేవు. అయితే దీని వెనుక శాస్త్రీయత, సంప్రదాయం దాగి ఉంది. ప్రధానంగా మన దేశం వ్యవసాయంపైన ఆధారపడి ఉందని అందరికీ తెలిసిందే.. మృగశిరకార్తె నుంచి ప్రారంభమైన తొలకరి చినుకుల రాక.. క్రమంగా ఆషాఢ మాసంలో అడుగు పెట్టే సరికి పూర్తి వర్షాకాలంగా మారిపోతుంది. సాగు ప్రధానవృత్తిగా ఉన్న మెజార్టీ కుటుంబాల్లో ఇంటిల్లిపాదీ వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. చినుకుల రాక కోసం ఎదురుచూస్తూ నల్లటి మేఘాలపై కొండంత ఆశతో దుక్కులు దున్నడం, నాట్లు వేయడం వంటి పనులు అనివార్యంగా జరపాల్సి ఉంటుంది. బడికి వెళ్లే పిల్లల్ని వదిలేస్తే పెద్దవాళ్లంతా వ్యవసాయ పనుల్లోనే బిజీగా ఉంటారు కాబట్టి కొత్త అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేయలేకపోతారు. కాబట్టి కర్మభూమిగా కీర్తిగాంచిన దేశంలో చేసే వృత్తిని కాదని మిగిలినవేవీ చేయాలనుకోరు. అందుకే ఈ నెలలో కొత్త అల్లుడు ఇంటికి రాకుండా ఉంటే సాగు పనులు నిరాటంకంగా సాగిపోతాయనే ఉద్దేశంతో ఈ నియమం వి«ధించారు. వ్యవసాయాధారిత కుటుంబాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ ఈ నియమాన్ని అనుసరిస్తున్నారు. ఆషాఢం ‘పట్టి’ ఆషాఢమాసంలో పుట్టింటికి పంపించే కోడలికి గతంలో అత్తవారింటి నుంచి ఆషాఢపట్టి అని ఒక పెట్టెను ఇచ్చి పంపించేవారు. దీనిలో ఉత్తరాలకట్ట, పెన్ను, పచ్చీసులాంటి ఆటవస్తువులుండేవి. నెలరోజుల ఎడబాటు కాలంలో భర్తకు ఉత్తరాలు రాసేందుకు, భర్త జ్ఞాపకాల నుంచి దూరంగా ఉండేందుకు, కాలక్షేపానికి పచ్చీసు ఉపయోగపడేది. ఈ సౌకర్యాలు కూడా లేని రోజుల్లో మేఘ సందేశాలు, పావురాల సందేశాలు ఉండేవంటారు. ఆషాఢ మాసంలో ఎదురయ్యే ప్రేయసీప్రియుల విరహవేదన ప్రధాన కథావస్తువుగా మహాకవి కాళిదాసు మేఘసందేశం రచించారు. ఇప్పుడు సెల్ఫోన్లు వచ్చాక.. వాట్సప్.. వీడియోకాల్స్‌లో మాట్లాడుకుంటున్నారు. కొత్త కోడళ్లకు ప్రత్యేకం నాకు ఇటీవలే వివాహమైంది. ఆషాఢమాసంలో పెట్టుపోత విషయంలో అత్తారింటివారు, అమ్మనాన్నలు కొత్తగా కొత్త బట్టలు ఇవ్వడం ఆచారం. అందుకోసం ఇటీవల షాపింగ్ చేశాం. చాలా రకాల కొత్త చీరలు, డ్రెస్‌లు అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్లు ఆకర్షించాయి. చాలా తక్కువ ధరకే అనుకున్న బట్టలు వచ్చాయి. – నవ్యశ్రీ, నూతన వధువు, ఖమ్మం -
ఆషాఢమొస్తోంది..
25న గోల్కొండ జగదాంబ జాతరతో ఆరంభం జూలై 2న విజయవాడ దుర్గమ్మకు బోనం సమర్పణ 9న ఉజ్జయిని మహంకాళి ఉత్సవం 10న రంగం, ఫలహారం బండి ఊరేగింపు 16న పాతబస్తీలో సమర్పణ.. 17న ఘటాల ఊరేగింపు కాకతీయుల కాలంలో ప్రారంభం ప్రాధాన్యమిచ్చిన కుతుబ్‌షాహీలు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. ఆషాఢమాసంలో నిర్వహించే చారిత్రక బోనాల జాతరకు సిటీ సిద్ధమవుతోంది.ఈ నెల 25న గోల్కొండ జగదాంబ జాతరతో ప్రారంభమయ్యే ఉత్సవాలు.. నెలరోజుల పాటు నగరవ్యాప్తంగా జరగనున్నాయి. డప్పువాయిద్యాలు.. పోతురాజుల విన్యాసాలు.. పలహారం బండ్ల ఊరేగింపు.. తొట్టెల సమర్పణ తదితర వేడుకలు అంబరాన్ని తాకనున్నాయి. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టేలా నగరంలో ఆషాఢమాస బోనాల జాతరను ఏటా కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఉత్సవాలకు ప్రభుత్వం ఈసారి రూ.10 కోట్లు మంజూరు చేసింది.కాకతీయుల కాలంలో బీజం పడి.. కుతుబ్‌షాహీల పాలనలో ప్రాచుర్యం పొందిన బోనాల జాతరకు ఘన చరిత్ర ఉంది. గోల్కొండ కోట గొల్లకోటగా కాకతీయుల పాలనతో ఉండేది. ఆనాడు బండరాళ్ల మధ్య స్వయంభూగా వెలసిన జగదాంబిక మహంకాళి అమ్మవారికి ఆలయాన్ని నిర్మించి, నిత్య పూజలు చేసేవారు. మరోపక్క రాజ్యంలో వ్యాధులు ప్రబలకుండా, కరువు కాటకాలు రాకుండా గ్రామాల్లో ఎల్లమ్మ తల్లికి పూజలు చేసేవారు. పంటలు చేతికి వచ్చాక ఆషాఢమాసంలో అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ వేడుకను కాకతీయ పాలకు అధికారికంగా గొల్లకొండ నుంచి నిర్వహిండం ప్రారంభిచారని చారిత్రక కథనం. అనంతర కాలంలో గొల్లకొండ ‘గోల్కొండ’గా మారి కుతుబ్‌షాహీల పాలన మొదలైంది. ఈ పాలకులు సైతం ప్రజల నమ్మకాన్ని గౌరవించి అమ్మవారి ఉత్సవాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. బోనాలను అధికారికంగా నిర్వహించిన ఘనత కుతుబ్షాహీలదే. వీరి అనంతరం పాలన సాగించిన అసఫ్జాహీలు సైతం ఆషాఢ బోనాలను అధికారికంగా కొనసాగించారు. కుతుబ్‌షాహీల కాలం నుంచి స్థానిక ముస్లింలు బోనాల ఏర్పాట్లు, నిర్వహణలో హిందువులకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా అమ్మవారి తొట్టెల ఊరేగింపుతోపాటు కోటలో బందోబస్తు ఏర్పాట్లలో కూడా మస్లింలు సహకరిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం.. కోటలో బోనాల ఉత్సవాలు కొనసాగాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో దేవాదాయశాఖ ఏటా ఉత్సవాల నిర్వహణకు కమిటీని నియమించి ఉత్సవాలు నిర్వహించేవారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా బోనాలు ప్రారంభమయ్యేది గోల్కొండ కోటలోనే. గత రెండేళ్లుగా దేవాదాయశాఖ అమ్మవార్ల ఆలయానికి కార్యనిర్వహణ అధికారిని, ఉత్సవ కమిటీని నియమించింది. ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టువస్త్రాలను సమర్పిస్తున్నారు. -
ఇంటి కత్తెరలో పోకచెక్క
ధన్‌ధన్... దభేల్ దభేల్.. ఖణేల్ ఖణేల్... వంటగది డీటీఎస్లో మోగిపోతోంది. గిన్నెల శబ్దాలు ఠాప్ఠాప్ మంటున్నాయి. ఈ వారంలో ఈ విన్యాసాలు మూడోసారి! కుకర్ హ్యాండిళ్లు విరిగిపోవటం, పచ్చడి మెత్తగా కాటుకలా అయిపోతున్నా మిక్సీని బర్ర్ర్ మని తిప్పుతూనే ఉండటం, ఇడ్లీలకని గ్రైండర్లో వేసిన పప్పు వడియాల పిండిలా నురగలు కక్కటం, చిక్కటి ఫిల్టర్ కాఫీ డికాషన్ కాస్తా చూరునీళ్లలా పల్చగా మారిపోవడం... ఇవన్నీ శ్రీమతికి కోపం వచ్చిందనడానికి సంకేతాలు. మొగుళ్ల అరుపులు.... పెళ్లాల అలకలు... అందరిళ్లలోనూ ఉండేవే. కాకపోతే మా ఇంట్లో మాత్రం కొంచెం వెరయిటీ. ఎందుకంటే నేనసలు అరిచే మొగుణ్ణి కాను... మా ఆవిడ అలిగే రకం కాదు... మావి మౌనయుద్ధాలు గిన్నెల మీద పరోక్ష ప్రతాపాలూ. అసలు పెళ్లిచూపుల్లోనే నాకు తను బాగా నచ్చింది. నెక్ట్స్ సీన్ పెళ్లి. ఎదురు చూసినంతకాలం పట్టలేదు... ఫెళ్లున పెళ్లయిపోయింది. పెళ్లయిన వారానికే మరో ట్రెడిషనల్ సీన్, ఆషాఢమాసం. మా కాపురంలో చిన్న బ్రేక్. తను వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ విరామంలోనే తొలి వివాదం. మా మధ్య మొదటి తగాదా. కారణం చిన్న నిర్లక్ష్యం. మా ఆవిడ వాళ్ల అమ్మవాళ్లింట్లో ఉండగా ఓ రోజు తలుపు సందులో పడి మా అమ్మ వేలు నలిగింది. బొటబొటా రక్తం కారిపోయింది. నొప్పితో అమ్మ విలవిలలాడి పోయింది. ఆ రాత్రి మా ఆవిడ ఫోన్ చేస్తే నేను వేలు నలిగిన విషయం చెవినేశాను. తను క్యాజువల్‌గా ‘అవునా’ అని ఊరుకుంది. తర్వాత ఆ విషయం నేనూ మర్చిపోయానూ, తనూ మర్చిపోయింది. అమ్మ మాత్రం మర్చి పోలేదు. తన వేలు నలిగినట్టు తెలిసి, తెలిసినవాళ్లవీ తెలియని వాళ్లవీ ఫోన్లూ పరామర్శలూ వెల్లువెత్తుతున్నాయి కానీ కోడలి దగ్గరనుంచి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి అనుమానంగా అడిగింది నన్ను ‘ఏరా! తనకి తెలుసా నాకు వేలు నలిగిందని’ అని. ‘తెలుసమ్మా! ఆ రోజే చెప్పాన్నేను’ అన్నాను. దాంతో అవమానంగా ఫీలయ్యింది. సరిగ్గా అప్పుడే నా ఫోన్ మోగింది. చూస్తే తనే. ‘ఇదిగో అమ్మా తన దగ్గర నుంచే ఫోన్. మాట్లాడతావా’ అంటూ కాల్ ఆన్సర్ చేసి, అమ్మ చేతికిచ్చాను సెల్లు. పొడిపొడిగా రెండు మాటలు మాట్లాడి తిరిగి ఫోన్ నా చేతికిచ్చేసింది. నేను కాసేపు అవీ ఇవీ మాట్లాడాక లోపలికొచ్చి ‘ఇంతకీ కూర ఏం చేస్తున్నావమ్మా’ అనడిగాను. ఆ ప్రశ్నే వినపడనట్టుగా... ‘మీ ఆవిడ నాతో ఒక్కమాట కూడా మాట్లాడలేదేంటీ’.. అంది సీరియస్‌గా. ‘అదేంటే, ఇప్పుడేగా మాట్లాడిందీ’ అన్నా వినిపించుకోలేదు. ‘ఒకపక్క నా వేలు నలిగి ఇంత బాధపడుతుంటే... అయ్యో! మీ వేలు నలిగిందట కదా, ఎలా ఉంది అత్తయ్యగారూ అని అడగనన్నా అడగలేదు మీ ఆవిడ. ఇట్లా అయితే ముందర ముందర నాకు ఇంకా ఏవైనా అయితే కనీసం ముఖం కూడా చూడదేమో మీ ఆవిడ...’ అమ్మ గొంతు రుద్ధమయింది. చెప్పొద్దూ... నాక్కూడా కోపమొచ్చింది తనమీద. వెంటనే ఫోన్ చేశా. ‘అవునూ... మా అమ్మకి వేలు నలిగిందని చెప్పా కదా... పలకరించావా?‘ అనడిగా... నా గొంతులో ఏదో మార్పు. అవతలి నుంచి తనేదో చెప్పబోతున్నా వినిపించుకోలేదు. ఆ తర్వాత పెళ్లిలో జరిగిన లోటుపాట్లను ఏకరువు పెట్టాను. అప్పటి వరకు మది పొరల్లో ఎక్కడో దాగి ఉన్నవన్నీ పొంగుకొచ్చేశాయి ఒక్కసారిగా. కొద్దిక్షణాలు నిశ్శబ్దం... తర్వాత వెక్కిళ్లు వినిపించాయి. నా తొందరపాటుకు బాధేసింది. తనని ఓదార్చాలని చూశాను. కానీ అంతగా కన్విన్స్ అయినట్లు కనిపించలేదు. ఆ గొడవ తీరి తిరిగి ఇద్దరం మామూలు కావడానికి తలప్రాణం తోకకొచ్చింది. తను కాపురానికొచ్చింది. వచ్చీ రాగానే వంట ఇంటి బాధ్యత తీసేసుకుంది. ఆ తర్వాత వంట తగాదాలు మొదలయ్యాయి. మేము తినే కూరలకీ వాళ్లు తినే కూరలకీ చాలా తేడాలు. చారులో పులుసులో కాకరకాయ కూరలో చక్కెర వేసేది తను. చోద్యంగా చూసేవాళ్లం మేము. చింతకాయ పచ్చడిలో బెల్లం, టమోటా పచ్చడిలో పంచదార పడకపోతే తినం మేం. వాళ్లేమో వైస్ వెర్సా. ఇలా కాదు అలా అని అంటే... వంట గదిలో నుంచి విచిత్రమైన సౌండ్ వచ్చేది. ఒక ముఖ్య పాత్ర కుయ్యో మని మూలిగేది. మరుసటి రోజు దాని నుదుటిన చిన్న సొట్ట కనిపించేది. నేనవి పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు. దాంతో పెళ్లయిన కొద్ది రోజులకే నాకు పెళ్లాం కొంగు పట్టుకు తిరిగే మొగుణ్ణని పేరొచ్చేసింది. మా అమ్మే నాకు ఆ కిరీటం పెట్టింది. మా అక్కలు ఆ కిరీటానికి మరికొన్ని అలంకారాలు చేశారు. కానీ తను మాత్రం నన్ను ‘అమ్మకూచి’ అంటుంది. ఇలా తల్లీ భార్యల మధ్య అడకత్తెరలో పోకచెక్కలా అయ్యింది నా పరిస్థితి. ఇంట్లో గిన్నెల సౌండ్లు... ఆఫీసులో నేనుండగా అమ్మ సెల్లు కంప్లెయింట్లు షరా మామూలే. ఎవరికీ ఏటూ చెప్పలేక ఓ మూణ్ణాలుగు నెలల్లోనే నాకు తోడుగా బీపి వచ్చేసింది. వీటన్నిటి నడుమా పెద్ద పిల్ల కడుపులో పడింది. ఐదోనెలలో పురిటికి తీసుకెళ్లి కాన్పు అయిన ఐదోనెలకు తీసుకొచ్చి దింపుతామని మా అత్తగారూ మరదలూ వచ్చారు. ‘అబ్బే! మాకు ఆన వాయితీ లేదలా. కావాలంటే తొమ్మిదోనెల వచ్చాక తీసుకుపోయి మళ్లీ నెల తిరిగేలోపే తీసుకొచ్చి దిగబెట్టాలి’ అంటూ అమ్మ కుండబద్దలు కొట్టింది. అప్పుడు కూడా ఆ కోపాన్ని పాపం కుక్కలా మా కుక్కరే అనుభవించింది. ఆ తర్వాత బారసాల విషయంలోనూ సారె విషయంలోనూ వచ్చిన మాట పట్టింపుల్లో వంట గదిలో పాత్రలు గడగడలాడటం జరిగిపోతూనే ఉంది. వాటి దోవన అవి నడుస్తుండగానే మరో బుజ్జి తల్లి వచ్చేసింది మా మధ్యకు. పిల్లల పెంపకంలోనూ మనస్పర్ధలు మామూలే.. తను చిన్నపిల్ల... పిల్లల పెంపకం పెద్దగా తెలియదు అని అమ్మ... ‘ఏం... నేను కన్నతల్లిని కాదా... నాకు తెలియదా వాళ్లకి ఎప్పుడు ఏం చెయ్యాలో’ అంటూ మా ఆవిడ... పౌడర్ డబ్బాలు సొట్టబుగ్గలతో సిగ్గుపడితే కాటుక భరిణెలు ఎగిరి ఎక్కడో పడిపోయేవి. అమ్మకు అది అర్థం అయ్యింది కాబోలు... ఏదో ఒకటి అనబోవడం.. మధ్యలోనే ఆ మాట మింగేసి మీరూ మీరూ ఒకటే మధ్యలో నేనేగా పరాయిదాన్నీ అనే పాత సినిమా డైలాగుని డెలివర్ చేయడం. ఇప్పటికి మా ఇంట్లో మిక్సీ ఎన్ని జార్లైనా మార్చుకోనీ... కుకర్ కొత్త హ్యాండిళ్లు ఎనైన్నా తగిలించుకోనీ... ఫ్రిజ్జూ వాషింగ్ మిషనూ టీవీ కవర్లెనైన్నా తొడుక్కోనీ... మా సమ్సార నౌక సాగిపోతూనే ఉంది.అది సమస్యారంలో చిక్కుకోకుండా... కనీసం ఇట్లా అయినా ముందుకు వెళ్లేలా చూడు భగవంతుడా అని రోజుకు ఒక్కసారైనా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాను. ఆ పూటకు నో వంట ‘అమ్మా.. నాన్నా.. నాకు ఉద్యోగం వచ్చింది’ అంటూ ఆనందంగా ఇంటికొస్తాడు చంద్రశేఖర్(వినోద్‌కుమార్). ‘సరే లే రా’ అని చాలా మామూలుగా అంటుంది తల్లి(వాణిశ్రీ). ‘మూడు వేల మందిలో ఈ ఉద్యోగం నాకే వచ్చింది తెలుసా అమ్మా’ అంటాడు నిష్టూరంగా. ‘నీ తెలివి తేటలతోనే ఉద్యోగం వస్తే, ఇంతకు ముందంతా రాలేదేం?’ అంతా కోడలు అమ్ములు(సౌందర్య) అదృష్టం. ఇది ఇంట్లో కాలు పెట్టింది.. నీకు ఉద్యోగం వచ్చింది’ అని మురిసిపోతుంది వాణిశ్రీ. సీన్ కట్ చేస్తే ఇద్దరూ కిచెన్‌లో ఉంటారు. చందూకి కోడిగుడ్డు ఇగురు ఇష్టమని వాణిశ్రీ వండుతుంటుంది. కాదు.. కాదు ఆయనకి ఆమ్లెట్టే ఇష్టమని చంద్రశేఖర్ భార్య(సౌందర్య)మరో పొయ్యి వెలిగిస్తుంది. సీన్ కట్ చేస్తే డైనింగ్ టేబుల్‌పై అమ్మ చేసిన ఇగురు, భార్య చేసిన ఆమ్లెట్లు ఉంటాయి. చంద్రశేఖర్ లొట్టలేస్తూ లాగించి రెండిటినీ మెచ్చుకుంటాడు. అక్కడి నుంచి అత్త, కోడళ్ల మధ్య ఈగో క్లాషెస్. కిచెన్‌లో గిన్నెలు డీటీఎస్ ఎఫెక్ట్స్‌తో నేలను తాకుతుంటాయి. కప్పులు, ప్లేట్లు ముక్కలవుతుంటాయి. తుఫాను తాకిడికి అల్లల్లాడిన చెట్టు కొమ్మల్లాగా తలుపులు దబ దబా కొట్టుకుంటాయి. చందూ ఇంటికొచ్చే టైమయింది. అత్త, కోడలు వంట ప్రయత్నం చేయరు. చంద్రమోహన్‌కి కడుపులో ఎలుకలు పరిగెడుతుంటాయి. వంట చేయమని భార్యని(వాణిశ్రీ), కోడల్ని ప్రాధేయపడతాడు. ఎవరూ స్రై్టక్ విరమించరు. సో... ఆ పూటకి నో వంట. వంటింటికి రెస్ట్. – డి.వి.ఆర్.