ఇంకా ఒక్క రోజే: ఉద్యోగులకు గుడ్న్యూస్ వస్తుందా?
7వ వేతన సంఘం కింద సమీక్షించిన జీతభత్యాల అమలుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా ఒక్క రోజుల్లోనే జీతభత్యాల విషయంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఓ క్లారిటీ రానుంది. రిపోర్టుల ప్రకారం అశోకా లావాసా ప్యానెల్ ప్రతిపాదిస్తూ సమర్పించిన డ్రాఫ్ట్ రిపోర్టుపై కార్యదర్శుల సాధికారిక కమిటీ సోమవారమే తుదినిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అశోక్ లావాసా ప్యానెల్ రిపోర్టును జూన్ 1 కంటే ముందే కార్యదర్శుల సాధికారిక కమిటీ పరిశీలిస్తుందని, వెంటనే దీనిపై తుది నిర్ణయం తీసుకుని కేంద్రకేబినెట్ ముందుకు తీసుకొస్తుందని కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హా తెలిపిన సంగతి తెలిసిందే. ఒకవేళ కార్యదర్శులు సాధికారిక కమిటీ, లావాసా ప్యానెల్ ప్రతిపాదలపై తుదినిర్ణయం తీసుకొని ఉంటే, ఆ ఫైల్ జూన్ 1 కంటే ముందే కేంద్రకేబినెట్ ముందుకు వెళ్లనుంది.
ఏడవ వేతన సంఘ సిపారసుల్లో జీతభత్యాల విషయంలో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో గతేడాది జూలైలో కేంద్రప్రభుత్వం అశోక్ లావాసా ప్యానెల్ ను ఏర్పాటుచేసింది. ఈ ప్యానెల్ సమీక్షించిన తమ ప్రతిపాదనలను ఏప్రిల్ 27న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సమర్పించింది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని జీతభత్యాలను సమీక్షించాలని కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఆశిస్తున్నారు. జీతభత్యాల విషయంలో ఈ కొత్త ప్రతిపాదనలతో హెచ్ఆర్ఏ 157 శాతం నుంచి 178 శాతం పెరుగనున్నట్టు తెలుస్తోంది.