Ashok Sharma
-
పోయింది ఏడు కాదు 50 కేజీలు!
జహీరాబాద్ ‘ముత్తూట్’లో భారీ బంగారం చోరీ ఆలస్యంగా వెలుగులోకి.. నిందితుల నుంచి 20 కేజీలు స్వాధీనం పట్టుబడింది ముగ్గురు దొంగ లే.. అత్యంత రహస్యంగా దర్యాప్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో భారీ బంగారు దోపిడీ..! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50కేజీలు! గత నెల మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో దొంగలు కొల్లగొట్టిన బంగారం పరి మాణం ఇది. ఈ దొంగతనంలో పోయింది ఏడు కేజీలని ఇప్పటి వరకు భావిస్తుండగా అసలు విషయం తాజాగా వెలుగుచూసింది. కాజేసిన బంగారంలో ఇప్పటివరకు 20కేజీలు మాత్రమే పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. అత్యంత రహస్యంగా దర్యాప్తు జరుపుతున్న రాష్ట్ర పోలీసులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లకు చెందిన ఆరుగురు దొంగల్లో ముగ్గురిని పట్టుకుని, రూ.10 లక్షలు రికవరీ చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, మిగతా ముగ్గురు నింది తుల కోసం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌ల్లో ముమ్మరంగా గాలిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. దొంగతనం ఇలా : జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో గత నెల 3న చోరీ జరిగింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌కు చెందిన దొంగల ముఠా 50కేజీల బంగారం, రూ.14 లక్షల నగదు ఎత్తుకుపోయింది. బెంగాల్‌కు చెందిన ఖమ్రుద్దీన్ జహీరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. అక్కడి పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో 9వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయాన్ని టార్గెట్‌గా చేసుకున్నాడు. పలుమార్లు రెక్కీ చేశాక చోరీ కోసం జార్ఖండ్‌కు చెందిన అశోక్‌శర్మ, యూసఫ్, వినోద్, కమల్సహా ఆరుగురితో కలిసి రంగంలోకి దిగాడు. దొంగలు గతనెల 2వ తేదీ రాత్రి ఖమ్రుద్దీన్ పనిచేసే అపార్ట్మెంట్ వద్ద తాత్కాలిక నివాసంలో బస చేశారు. 3వ తేదీ తెల్లవారుజామున గ్యాస్‌కట్టర్లు, గడ్డపారలు, ఇనుపరాడ్లతో విరుచుకుపడ్డారు. ముత్తూట్ కార్యాలయం వెనుక భాగంలోని తలుపును తొలగించి లోనికెళ్లారు. సీసీ కెమెరా వైర్లను కత్తిరించి, గ్యాస్కట్టర్ల సాయంతో స్ట్రాంగ్ రూమ్ ఏ-1లోని సేఫ్ లాకర్లను తెరిచి వినియోగదారులు తాకట్టు పెట్టిన బంగారం, నగదును సంచుల్లో సర్దుకున్నారు. ఎంజీబీస్‌లో దొరికిన దొంగ ఉదయం ఐదుగంటలకు ఆరుగురూ కర్ణాటక ఆర్టీసీ బస్సెక్కి నేరుగా హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ వెళ్లి, అట్నుంచి జార్ఖండ్ పారి పోవాలని పథకం వేశారు. ఎంజీబీఎస్‌లో ఆరోజు ఆర్టీసీ భద్రతా సిబ్బంది చేసిన తనిఖీల్లో అశోక్‌శర్మ పట్టుబడ్డాడు. అఫ్జల్‌గంజ్ పోలీసులు అతడిని విచారించేదాకా చోరీ గురించి ఎవరికీ తెలియలేదు. అశోక్‌శర్మను ప్రిజనర్స్ ట్రాన్సిట్(పీటీ) వారెంట్‌పై తీసుకువెళ్లి విచారించగా అసలు సంగతి బయటపడింది. 50కేజీలకు పైగా బంగారం చోరుల పాలైనట్లు పోలీ సులు నిర్ధారించారు. ఈ చోరీ సూత్రధారి ఖమ్రుద్దీన్ గత ఏడాది మార్చి 29న మెదక్‌జిల్లా కవేలీలోని సిండికేట్ బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు ముఠాతో కలిసి యత్నించాడు. అలారం మోగడంతో ఘటనాస్థలికి వచ్చిన ఎస్సైపై కాల్పులు జరిపి అరెస్టయ్యాడు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చి మరో ముఠాతో కలిసి ‘ముత్తూట్ చోరీ’కి పాల్పడ్డాడు. -
మహీంద్రా... బ్రాండెడ్ పండ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుమారు రెండు లక్షల కోట్ల విలువైన దేశీయ పండ్ల మార్కెట్లోకి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రవేశించింది. ఇందులో భాగంగా ‘సబొరో’ బ్రాండ్ పేరు మీద యాపిల్ పండ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ‘సబొరో’ బ్రాండ్‌ను జాతీయ స్థాయిలో లాంఛనంగా ఆవిష్కరించింది. అంతర్జాతీయంగా దిగుమతి చేసుకునే బ్రాండెడ్ పండ్లకు హైదరాబాద్ పెద్ద మార్కెట్ కావడంతో ‘సబొరో’ బ్రాండ్‌ను ఇక్కడ ప్రారంభించినట్లు ఎం అండ్ ఎం అగ్రి, అల్లైడ్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ శర్మ తెలిపారు. బ్రాండెడ్ పండ్లను పరిచయం చేసిన తొలి దేశీయ కంపెనీగా ఎంఅండ్ఎం రికార్డులకు ఎక్కిందనివచ్చే మూడేళ్లలో రూ.300 కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. సొంతంగా ఔట్లెట్లను ఏర్పాటు చేయడం లేదని, వివిధ రిటైల్ సంస్థల ద్వారా ఈ బ్రాండ్‌ను విక్రయించనున్నట్లు అశోక్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని ఆరు ప్రధాన పట్టణాల్లో 200 రిటైల్ ఔట్లెట్లలో సొబొరో బ్రాండ్ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం హెరిటేజ్ ఫ్రెష్, గోద్రేజ్ నేచుర్స్ బాస్కెట్ వంటి రిటైల్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మరికొన్ని రిటైల్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు అశోక్ వివరించారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ కింద యాపిల్‌ను మాత్రమే పరిచయం చేశామని, ఇక ధరల విషయానికి వస్తే దిగుమతి చేసుకున్న యాపిల్ ధరల కంటే 20 శాతం తక్కువగాను, దేశీయంగా అందుబాటులో ఉండే యాపిల్ కంటే 10 నుంచి 15 శాతం ధర అధికంగా ఉంటాయన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎగుమతి చేస్తున్న ద్రాక్ష పండ్లను ఈ సీజన్ మొదలు కాగానే దేశీయంగా కూడా విక్రయించనున్నట్లు తెలిపారు. గతేడాది రూ.65 కోట్ల ద్రాక్ష ఎగుమతులు చేయగా, ఈ ఏడాది రూ.90 కోట్ల వ్యాపారాన్ని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో దేశీయ అరటి పండ్లను, సిట్రస్, పీర్స్ వంటి విదేశీ పండ్లను పరిచయం చేయనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటి వరకు రూ.20 కోట్లు వెచ్చించామని, భవిష్యత్తు విస్తరణ కోసం రూ.40 కోట్ల వరకు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. హిమాచల్, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి సేకరించిన యాపిల్ పండ్లను హైదరాబాద్ శీతల గిడ్డంగుల్లో భద్రపర్చి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు అశోక్ వివరించారు. పులివెందుల రైతులతో చర్చలు రైతుల నుంచి నాణ్యమైన ఉత్పత్తులను సేకరించడానికి వివిధ రాష్ట్రాల్లోన్ని రైతులతో కాంట్రాక్టింగ్ వ్యవసాయ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఎం అండ్ ఎం శుభ్లాభా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ పురి తెలిపారు. రాష్ట్రంలో ద్రాక్షకు సంబంధించి 10 మంది రైతులతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అరటికి సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో పండించే కావిండిష్ రకం అరటి పండుకు మంచి డిమాండ్ ఉందని, దీనికి సంబంధించి అక్కడి రైతులతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. దీని తర్వాత తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ప్రాంత రైతులపై దృష్టి పెట్టనున్నట్లు విక్రమ్ తెలిపారు.