ఆసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఆసెట్–2017 గురువారం ప్రారంభమైంది. వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన చేశారు. సహాయ కేంద్రాన్ని ఇన్చార్జ్ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య ప్రారంభించారు. తొలిరోజు 1000 ర్యాంకులోపు ఫిజికల్ సైన్స్, 2000 ర్యాంకు లోపు కెమిస్ట్రీ , 547 ర్యాంకులోపు ఇంగ్లిష్ విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొత్తం 67 మంది హాజరయ్యారు. శుక్రవారం వర్సిటీ సహాయ కేంద్రంలో 1534 ర్యాంకు లోçపు ఫిజిక్స్, 4489లోపు కెమికల్ సైన్సెస్, హ్యుమానిటీస్, సొషల్ సైన్స్‌కు సంబంధించి 1500లోపు విద్యార్థులు ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ రిజస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్ పె ద్దకోట చిరంజీవిలు పరిశీలించారు.