ashton carter
-
భారత్ గొప్ప దేశం.. మా బంధం దృఢమైనది: అమెరికా
వాషింగ్టన్: భారత్-అమెరికాల సైనిక విభాగం విషయంలో ఎప్పటికీ చాలా అన్యోన్యమైన సంబంధం ఉంటుందని అమెరికా రక్షణశాఖ కార్యదర్శి ఆష్టన్ కార్టర్ అన్నారు. తమ రెండు దేశాలు ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశాలని కొనియాడారు. వ్యూహాత్మక విషయాల్లో, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఎప్పుడో చేతులుకలిపామని అన్నారు. ఉపరితల, గగనతల, సముద్రంపైనా తొలిసారి ఇరు దేశాలు కలిసి విన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. 'అమెరికా వివిద ప్రాంతాల మధ్య స్థానిక భాగస్వామ్యాలు పెరగడమే కాదు.. మరింతగా బలపడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా భారత్ అమెరికాల మధ్య మిలటరీ సంబంధాలు బలపడ్డాయి. భారత్ గొప్ప దేశం. పెద్ద ప్రజాస్వామ్యం గలది' అంటూ ఆయన కొనియాడారు. 'భారత్ అమెరికా మధ్య ఒక్క సైనిక ఒప్పందాలే కాదు.. సాంకేతిక పరిజ్ఞానపరమైన ఒప్పందాలు కూడా జరిగాయి. మోదీ మేకిన్ ఇండియా ప్రచార కార్యక్రమంలో భాగంగా మా దేశాలకు కూడా సైనిక పరమైన అవసరాల విషయంలో, క్షిపణి వ్యవస్థ విషయంలో సహకారం చేసుకునే అవకాశం వచ్చింది' అని ఆయన అన్నారు. -
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా దూకుడు
కౌలాలంపూర్: అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ యాస్టన్ కార్టర్ గురువారం దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో పర్యటించనున్నారు. ఇటీవల అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్ఎస్ థియోడార్ రూజ్వెల్ట్ వివాదాస్పద జలాలలోకి ప్రవేశించడంతో చైనా నావికాదళం దీనిపై ఆగ్రహం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్టర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కౌలాలంపూర్‌లో దక్షిణ చైనా సముద్ర సరిహద్దులకు సంబంధించి జరుగుతున్న ఆసియా పసిఫిక్ దేశాల రక్షణ శాఖ అధికారుల సమావేశంలో కార్టర్ పాల్గొన్నారు. అనంతరం దక్షిణ చైనా సముద్రంలోని అమెరికాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌ను సందర్శించనున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక విధానాన్ని తెలియజేయడంతో పాటు చైనాతో కవ్వింపు చర్యలకు పాల్పడే విధంగా కార్టర్ పర్యటన ఉందని విశ్లేశకులు అభిప్రాయపడుతున్నారు. -
న్యూఢిల్లీలో యూఎస్ రక్షణ మంత్రి ఆస్టన్ కార్టర్