యూపీలో 'ఆప్'కు ఎదురుదెబ్బ
లక్నో: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు ఉత్తరప్రదేశ్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఆశ్విని ఉపాధ్యాయ, 2400 మంది కార్యకర్తలు ఆప్‌కు రాజీనామా చేశారు. వీరిలో 8 వార్డుల కన్వీనర్లు, 40 స్థానిక ఇన్చార్జులు ఉన్నారు.
సామాన్యుడిని ఆప్ మోసం చేసిందని ఉపాధ్యాయ ఆరోపించారు.
రాజ్యాంగవిరుద్దంగా లోక్‌పాల్ ఎందుకు తేవాలనుకుంటున్నారని అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. ఢిల్లీ లోకాయుక్తను ఎందుకు బలోపేతం చేయలేదని అడిగారు. రిఫరెండం నిర్వహించకుండానే ఢి్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారని అన్నారు. ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకుని 455 స్థానాల్లో ఆప్ అభ్యర్థులను నిలబెట్టిందని ఉపాధ్యాయ ఆరోపించారు.