భారత అమ్మాయిల విజయం
బ్యాంకాంక్: ఆసియా కప్ అండర్ – 18 హాకీ టోర్నమెంట్లో భారత అమ్మాయిల హవా కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 3–1తో మలేసియా జట్టుపై గెలిచి పూల్ ‘ఎ’లో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ తరఫున మన్‌ప్రీత్ కౌర్, పూనమ్ (39వ ని.), లాల్రెమ్సియామి (46వ ని.) గోల్స్ చేయగా... మలేసియాకు నురామిరా షకీరా (40వ ని.) గోల్‌ను అందించింది.