The Asian Football Confederation
-
భారత్, బంగ్లాదేశ్ ఫుట్బాల్ మ్యాచ్ డ్రా
ఢాకా: ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) అండర్-23 చాంపియన్షిప్ అర్హత రౌండ్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. అయితే స్థానిక బంగబంధు మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రథమార్ధం ముగియగానే ఫ్లడ్లైట్లు మొరాయించాయి. 40 నిమిషాలు వేచి చూసిన అనంతరం మ్యాచ్ ప్రారంభం కావడంతో ఆటగాళ్లలో అంతకుముందటి జోష్ కనిపించలేదు. ఈ డ్రాతో ఆడిన మూడు మ్యాచ్ల్లో భారత్ ఒక్క పాయింట్ సాధించి నాలుగు జట్ల గ్రూపులో మూడో స్థానంలో నిలిచింది. దీంతో తదుపరి దశకు అర్హత సాధించలేకపోయింది. -
ఆసియా ఫుట్బాల్ కప్లో 85 ఏళ్ల రికార్డు బద్దలు
సిడ్నీ: ఆసియా ఫుట్బాల్ కప్లో 85 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలయ్యింది. ఈ నెల 9 నుంచి ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఆసియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) ఈవెంట్లో ప్రారంభ మ్యాచ్ నుంచి సోమవారం వరకు జరిగిన 22 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా డ్రా కాకుండా ఫలితాలు నమోదయ్యాయి. దీంతో 1930 ఫిఫా ప్రపంచకప్లో నమోదైన 18 మ్యాచ్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఈనెల 31న ఫైనల్ మ్యాచ్ సిడ్నీలో జరుగుతుంది.