భారత్, బంగ్లాదేశ్ ఫుట్‌బాల్ మ్యాచ్ డ్రా | soccer match between india vs bangladesh was drawn | Sakshi
Sakshi News home page

భారత్, బంగ్లాదేశ్ ఫుట్‌బాల్ మ్యాచ్ డ్రా

Published Wed, Apr 1 2015 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

soccer match between india vs bangladesh was drawn

ఢాకా: ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) అండర్-23 చాంపియన్‌షిప్ అర్హత రౌండ్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. అయితే స్థానిక బంగబంధు మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రథమార్ధం ముగియగానే ఫ్లడ్‌లైట్లు మొరాయించాయి. 40 నిమిషాలు వేచి చూసిన అనంతరం మ్యాచ్ ప్రారంభం కావడంతో ఆటగాళ్లలో అంతకుముందటి జోష్ కనిపించలేదు. ఈ డ్రాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ ఒక్క పాయింట్ సాధించి నాలుగు జట్ల గ్రూపులో మూడో స్థానంలో నిలిచింది. దీంతో తదుపరి దశకు అర్హత సాధించలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement