Assam PCCpresident
-
బీజేపీలో చేరిన భూపేన్ బోరా
గువాహటి: అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా ఆదివారం అధికార బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకీయా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే బోరాకు కీలక పదవి లభించింది. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం కల్పించారు. కాంగ్రెస్ నేతలు సంజూ బోరా, రాజేశ్‌కుమార్ జోషీ, కంగన్ దాస్, గగన్‌చంద్ర బోరాతోపాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. భూపేన్ కుమార్ బోరా ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్‌కు రాజీనామా సమర్పించారు. రాహుల్ గాంధీ సహా పలు సీనియర్ నేతలు బోరాతో మాట్లాడి బుజ్జగించినా ఆయన మనసు మార్చుకోలేదు. అస్సాంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. -
అసోం పీసీసీ అధ్యక్షుడు కన్నుమూత
న్యూఢిల్లీ : అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంజన్ దత్తా (64) గురువారం కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా అంజన్ దత్తా గత కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 17న చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌లో చేర్పించారు. అప్పటి నుంచి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. అయితే అంజన్ దత్త ఆరోగ్యం విషమించడంతో ఇవాళ మృతి చెందారు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా, రవాణా మంత్రిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 25న అంజన్ దత్తాను పరామర్శించిన వషయం తెలిసిందే. మరోవైపు అంజన్ దత్తా మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది.


