న్యూఢిల్లీ : అసోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంజన్ దత్తా (64) గురువారం కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా అంజన్ దత్తా గత కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 17న చికిత్స నిమిత్తం ఎయిమ్స్లో చేర్పించారు.
అప్పటి నుంచి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. అయితే అంజన్ దత్త ఆరోగ్యం విషమించడంతో ఇవాళ మృతి చెందారు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా, రవాణా మంత్రిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 25న అంజన్ దత్తాను పరామర్శించిన వషయం తెలిసిందే. మరోవైపు అంజన్ దత్తా మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది.