అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
శాసనసభలో బుధవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయ అంచనాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి, ఆ అంశంపై సభలో చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. మున్సిపల్ కార్మికుల చేస్తున్న సమ్మెపై చర్చించాలని ఎంఐఎం, సీపీఎంలు, అసంఘటిత కార్మికుల సమ్మె అంశంపై చర్చతోపాటు విద్యా, వైద్య ఉపాద్యాయ అంగన్వాడీల సంక్షేమానికి సమగ్ర చట్టం కోరుతూ సీపీఐ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయ అంచనాలను కేబినెట్ ఆమోదం లేకుండా ఇరవై వేల కోట్ల ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు ధారదత్తం చేసేలా సీఎం ఉత్తరవ్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను రద్దు చేసి, ఆ వ్యవహరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.