నేడు అసెంబ్లీ ప్రారంభోత్సవం
సాక్షి, అమరావతి: వెలగపూడిలోని అసెంబ్లీ భవనం గురువారం ప్రారంభం కానుంది. ఉదయం 11.25 గంటలకు సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవానికి ప్రధాన ప్రతిపక్ష నేత, మంత్రులు, ఎమ్మెల్సీలు, అధికారులు, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రులు యనమల, నారాయణ తెలిపారు. 6న∙అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు.