'జైళ్లకు, కోర్టులకు వెళ్లడం రేవంత్‌కి అలవాటు'
హైదరాబాద్ : రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజనపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తోందని ఆయన చెప్పారు. అనవసరంగా విపక్షాలే రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైళ్లకు, కోర్టులకు వెళ్లడం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి అలవాటని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు.