Assembly Selection
-
టీఆర్ఎస్కే అనుకూలం: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నట్టు భావిస్తున్నామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. టీఆర్ఎస్కు మేజిక్ఫిగర్ కంటే తక్కువ వస్తే బీజేపీ, ఎంఐఎం మద్దతిచ్చే అవకాశాలున్నాయన్నారు. ఉత్తర తెలంగాణలో ఓటింగ్ పెరిగిన ప్రభావం కూడా టీఆర్ఎస్కు అనుకూలించవచ్చని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. మొదట్లో టీఆర్ఎస్–ప్రజాకూటమి మధ్య హోరాహోరీ పోరు సాగినా, చివరకు టీఆర్ఎస్ పట్ల సానుకూలత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయన్నారు. వివిధ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్ సర్వేల్లో ఫలితాలు మిశ్రమంగా వచ్చాయన్నారు. ఈ ఎన్నికలపై డబ్బు ప్రభావం తీవ్రస్థాయిలో ఉందని, దానిని అరికట్టడంలో లేదా నియంత్రించడంలో ఈసీ, పోలీసువర్గాలు పూర్తిస్థాయిలో విఫలమయ్యారన్నారు. సీపీఎం–బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ (బీఎల్ఎఫ్) 107 స్థానాల్లో పోటీచేయడం ద్వారా ప్రత్యామ్నాయ విధానాలు, సామాజికన్యాయం–సమగ్రాభివృద్ధిని ప్రజల్లో చర్చనీయాంశం చేయగలిగామన్నారు. సీపీఎంగా పోటీచేసిన 26 సీట్లలో కనీసం ఒకటి, రెండుస్థానాల్లో, బీఎల్ఎఫ్ అభ్యర్థులు బరిలో నిలిచిన 81 సీట్లలో రెండు, మూడు చోట్ల విజయావకాశాలున్నట్టు అంచనా వేస్తున్నామన్నారు. సీపీఎం–బీఎల్ఎఫ్ పోటీచేసిన కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో తమ ఫ్రంట్‌కు ఓట్లు పడే అవకాశాలున్నాయన్నారు. -
మూడు రాష్ట్రాల్లో బీజేపీకి షాక్
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్ ఇచ్చేలా ఫలితాలు ఉండబోతున్నాయని తేలింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించబోతోందని, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లోనూ కాంగ్రెస్ వైపే మొగ్గు ఉందని తాజాగా వెల్లడైన రెండు ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. అసెంబ్లీ పోరుకు సిద్ధమవుతున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లో ఓటరు నాడిని పసిగట్టేందుకు ‘ఏబీపీ న్యూస్– సీఓటర్’, ‘సీ ఫోర్’ సంస్థలు వేర్వేరుగా సర్వేలు జరిపాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి పరాజయం దాదాపు ఖాయమేనని ఆ సర్వేల్లో తేలింది. ఏబీసీ– సీఓటర్ మూడు రాష్ట్రాల్లోనూ సర్వే నిర్వహించగా, సీఫోర్ రాజస్తాన్‌లో మాత్రమే సర్వే చేసింది. అయితే, బీజేపీ గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో ఆ పార్టీకి, కాంగ్రెస్‌కు మధ్య గెలుచుకునే సీట్లలో ఓట్ల శాతంలో స్వల్ప తేడానే ఉండటం గమనార్హం. అందువల్ల ఎన్నికల నాటికి చోటు చేసుకునే ఏ స్వల్ప పరిణామమైనా, సీట్ల సంఖ్యలో గణనీయ మార్పును తీసుకువచ్చే అవకాశముంది. ఈ సర్వేలో సీఫోర్ రాజస్తాన్‌లో 5,788 మంది నుంచి, ఏబీపీ న్యూస్–సీ ఓటర్ మూడు రాష్ట్రాల్లో కలిపి 26, 196 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. రాజస్తాన్ రాజస్తాన్‌లోని మొత్తం 200 స్థానాల్లో కాంగ్రెస్ 49.9 ఓట్ల శాతంతో 142 సీట్లలో గెలవబోతోందని ఏబీపీ సీఓటర్ సర్వే తేల్చింది. 34.3 ఓట్ల శాతంతో బీజేపీ కేవలం 56 స్థానాల్లో గెలవనుందని పేర్కొంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలోనూ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వైపే రాష్ట్ర ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. సీఎం అభ్యర్థిగా పైలట్‌కు 36%, ప్రస్తుత సీఎం వసుంధర రాజేకు 27%, కాంగ్రెస్ మరో నేత అశోక్ గెహ్లాట్‌కు 24% ఓటేశారు. సీఫోర్ సర్వే కూడా కాంగ్రెస్‌కు 124 నుంచి 138 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 50%, బీజేపీకి 43% ఓట్లు లభిస్తాయని తెలిపింది. ఈ సర్వే ఫలితాలే నిజమైతే.. ప్రతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయే రాజస్తాన్ సంప్రదాయం కొనసాగినట్లవుతుంది. మధ్యప్రదేశ్ గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి పరాజయం దిశగా వెళ్తోందని ఏబీపీ– సీ ఓటర్ సర్వే పేర్కొంది. అయితే, సీఎం అభ్యర్థిగా మాత్రం శివరాజ్‌సింగ్ చౌహాన్కే అత్యధికులు ఓటేశారు. 230 స్థానాలున్న అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 122 సీట్లను గెలుస్తుందని, బీజేపీ 108 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. ఓట్ల శాతం విషయానికి వస్తే కాంగ్రెస్ 42.2%, బీజేపీ 41.5% సాధించనున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య కేవలం 0.7 శాతమే తేడా ఉండటం గమనార్హం. ఛత్తీస్‌గఢ్ సీఎంగా రమణ్‌సింగ్‌కే ఛత్తీస్‌గఢ్ ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. కానీ సీట్ల విషయానికి వస్తే మొత్తం 90 స్థానాల్లో కాంగ్రెస్ 38.9% ఓట్లతో 47 సీట్లలో, బీజేపీ 38.2% ఓట్లతో 40 సీట్లలో గెలవనుందని సర్వే తేల్చింది. ఇక్కడ కూడా రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 0.7 మాత్రమే. 2013 ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో వరుసగా 165, 142, 49 సీట్లు గెలుచుకుని బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుచుకున్న సీట్లు వరుసగా 58, 21, 39 కావడం గమనార్హం. -
మళ్లీ ఓటేస్తే.. సేవ చేస్తా
అరవవాండ్లపల్లిలో రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నేను వేసిన రోడ్డు మీద నడుస్తూ, నేను ఇచ్చిన నీళ్లు తాగుతూ, నేనిచ్చిన పింఛన్ తీసుకుంటూ.. నన్ను పట్టించుకోవడం మానేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఆరు చోట్లే గెలిపించారు. అయినా నేను జిల్లాను అభివృద్ధి చేస్తున్నా’ అని చంద్రబాబు రైతులతో తన ఆక్రోశం వెళ్లగక్కారు. శనివారం పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం అరవవాండ్లపల్లిలో మామిడి రైతుల సంఘం నిర్మించుకున్న పంట సంజీవని, సోలార్ పంప్సెట్లను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రైతులతో ముఖాముఖి నిర్వహిం చారు. రైతులకు నీటి పొదుపుపై శ్రద్ధతోపాటు సమగ్ర వాడకంపై అవగాహన పెరగాలని లేకపోతే చట్టం చేస్తామని రైతులను హెచ్చరించారు. రైతులందరూ సెల్ఫోన్లు మాత్రం వాడుతున్నారు కానీ నీళ్ల విషయం పట్టించుకోవడం లేదన్నారు. కరవు రావడానికి వాతావరణంలో వచ్చిన మార్పులే కారణమన్నారు. వర్షం నీటి పొదుపు కోసం పంట సంజీవని కుంటలు ఊరూరా ఉండాలన్నారు. రాష్ట్రంలో డెయిరీ, చేపల పెంపకానికి ప్రాధాన్యమిసు ్తన్నామని చెప్పారు. నిద్ర లేపి మరీ ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. సెల్ఫోన్లు పట్టుకుని హుషారుగా తిరుగుతున్న చాలా మంది మరుగు దొడ్డిని నిర్మించుకోవాలని మాత్రం ఆలోచించడం లేదన్నారు. అమరావతిలో కూర్చుని చిత్తూరు జిల్లా లోని భూమిలో ఎంత తేమ ఉందో చెప్పగల టెక్నాల జీ వస్తుందన్నారు. ప్రపంచంలో ఉన్న నాలెడ్జిని మొత్తం తెస్తానని దాన్ని ఆచరణలో పెట్టాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రు లు నారా లోకేశ్, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎన్.అమరనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.