స్పీకర్ ను కలవనున్న వైఎస్ఆర్ సీపీ నేతలు
హైదరాబాద్ : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను కలవనున్నారు. అసెంబ్లీ లాంజీలో తొలగించిన దివంగత నేత వైఎస్సార్ చిత్ర పటాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని స్పీకర్ ను వైఎస్ఆర్ సీపీ నేతలు కోరనున్నట్లు సమాచారం.