asses
-
గర్భిణిని దహనం చేసిన బూడిదలో బంగారం కోసం..
ముంబై : గర్భిణిని దహనం చేసిన బూడిదలోని నగల అవశేషాలను దొంగిలించటానికి ప్రయత్నించి నలుగురు అడ్డంగా బుక్కయ్యారు. గ్రామస్తుల చేతిలో దెబ్బలు తిని జైలు పాలయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఆలస్యంగావెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోలాపూర్ జిల్లా బర్లోని గ్రామానికి చెందిన దాదాసాహెబ్ హన్వంతే, రుక్మిణి, రామచంద్ర కస్బే, స్వాతిలు తమ ఉద్యోగాలు కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 22వ తేదీన మరణించిన ఓ గర్భిణి అంత్యక్రియలు బంగారు నగలు మృతదేహంపై ఉంచి చేస్తారని వారికి తెలిసింది. గర్భిణి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత బూడిదలో కరిగిన బంగారాన్ని దొంగిలించాలని వారు నిశ్చయించుకున్నారు. బుధవారం అంత్యక్రియలు అయిపోయిన తర్వాత బూడిదలో నగల అవశేషాల కోసం వెతకుతూ.. గ్రామస్తుల కంట బడ్డారు. దీంతో గ్రామస్తులు వారిని పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. ఓ గ్రామస్తుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి : నిండు గర్భిణిని కాళ్లతో తొక్కి చంపేశారు.. ఒలంపిక్ మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆత్మహత్య! -
కొడుకుల కోసం గాడిద స్వారీ..!
అహ్మదాబాద్ః ఎవరినైనా అవమానించాలనుకున్నపుడు, శిక్ష విధించాలనుకున్నపుడు వారికి గుండు గీయించి, లేదా ముఖానికి నల్ల రంగు పూసి గాడిదపై ఊరేగించడం దక్షిణాసియా రాష్ట్రాల్లో పురాతన ఆచారంగా కనిపిస్తుంది. అయితే గుజరాత్ రాష్ట్రంలో నేటికీ అటువంటి ఆచారం ఒకటి కొనసాగుతోంది. అయితే దాని వెనుక కారణం మాత్రం భిన్నంగా ఉంది. గాడిదపై ఊరేగితే కొడుకులు పుడతారన్నది అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. అందుకే ఆ గ్రామంలో గాడిదలకు నేటికీ గిరాకీ కొనసాగడమే కాదు... దానిపై ఊరేగేందుకు ప్రజలు ఏకంగా వెయిటింగ్ లిస్టులో ఉండటం విశేషం. గుజరాత్ జనగథ్ జిల్లా బోర్ వావ్ గ్రామానికి చెందిన రమేష్ సువాగియా అనే 38 ఏళ్ళ రైతు గాడిదను ఎక్కేందుకు ముందుగా తన ముఖానికి నల్లని రంగు పూసుకున్నాడు. గాడిదపై ఎక్కి గ్రామమంతా తిరుగుతూ బిక్షమెత్తేందుకు సిద్ధమయ్యాడు. గురువారం సంప్రదాయ పండుగ 'ధులేటి' (వారసులకోసం జరిపే పండుగ) సందర్భంలో తమ గ్రామంలో ఆచారంగా వస్తున్న గాడిదస్వారీ చేసేందుకు వేచిఉన్నవారిలో రమేష్ ఒకడు. పూర్వకాలంనుంచీ 'రాంగ్' పేరున గ్రామంలో ఈ వింత ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పండుగనాడు గాడిదపై ఎక్కి గ్రామమంతా తిరుగుతూ అందరివద్దా గోధుమలు, డబ్బును వసూలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సంప్రదాయం ఒకప్పుడు పక్షుల మేతకోసమే ప్రారంభమైనట్లు చెప్తారు. ఇలా వసూలు చేసిన వాటిని సంవత్సరమంతా అక్కడి పక్షుల మేతకు వినియోగిస్తుంటారు. అయితే ఇదే సంప్రదాయంలో భాగంగా ఇలా చేస్తే వారసులు జన్మిస్తారన్న నమ్మడంతో కొడుకులు పుట్టాలనుకున్నవారు దీన్ని కొనాసాగిస్తున్నారు. నాకు 17, 6 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారని.. ఈ సంప్రదాయాన్ని నేను ఏడేళ్ళక్రితం పాటించడం ప్రారంభించానని చెప్తున్నాడు రమేష్. తమ నమ్మకాన్ని మరింత పెంచే విధంగా గతేడాది తనకు కొడుకు పుట్టాడని, గాడిదపై ఊరేగుతూ ఈ సంప్రదాయం కొనసాగించడంలో తమకెటువంటి సంకోచం లేదని రమేష్ సువాగియా చెప్తున్నాడు. వచ్చే ఐదేళ్ళలో రాంగ్స్ పద్ధతిని పాటించేందుకు గ్రామంలోని సుమారు పది కుటుంబాలు ప్రతిజ్ఞ చేసి, వేచి చూస్తున్నాయని, ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని తాము రెండు గాడిదలను అందుబాటులో ఉంచామని డిప్యూటీ సర్పంచ్ ప్రవీణ్ వాడి తెలిపారు. అయితే ఈ ఆచారం దశాబ్దాలుగా కొడుకు పుట్టాలని కోరుతూ కొనసాగుతోందని, మారుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడు పిల్లల్లేని దంపతులు, ఆడపిల్లల కోసం కొనసాగించేందుకు ప్రోత్సహిస్తున్నామని సర్పంచ్ ప్రకాష్ గిరి అపర్నాథ్ తెలిపారు. -
సన్యాసం స్వీకరించిన రంజిత
బెంగళూరు, న్యూస్‌లైన్ : నిత్యానంద శిష్యురాలు, బహుభాషా నటి రంజిత శుక్రవారం సన్యాసం స్వీకరించారు. బెంగళూరు శివారులోని బిడిది సమీపంలోని ధ్యానపీఠంలో నిత్యానంద సమక్షంలో జరిగిన ఈ వేడుకలో రంజితతో పాటు 40 మంది సన్యాసం తీసుకున్నారు. అనంతరం రంజిత పేరును ‘మా ఆనందమయి’గా మార్చారు. ప్రతి ఏటా జనవరి 1న నిత్యానంద పుట్టిన రోజు జరుపుకుంటారు. అయితే జన్మనక్షత్రం ప్రకారం శుక్రవారం ఆయన ఈ వేడుకను తన శిష్యుల మధ్య పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 1వ తేది వరకు ధ్యానపీఠంలో పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా, నిత్యానంద జన్మదిన వేడుకలకు మీడియాను దూరం పెట్టారు. కేసులుండగా సన్యాసమా? నటి రంజిత సన్యాసం తీసుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని శ్రీజగద్గురు బసవ ధర్మ పీఠాధ్యక్షురాలు మాత మహాదేవి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... నిత్యానంద - రంజితల కేసు విచారణ దశలోనే ఉందని, ఈ సమయంలో ఆమె సన్యాసం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సన్యాసం తీసుకోవడమంటే అంత సులువు కాదని, సేవ చేయడానికి సిద్ధం కావాలని, అన్ని త్యాగం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని భోగాలు అనుభవిస్తూ సన్యాసి అని చెప్పుకోవడం సాధ్యం కాదని గుర్తు చేశారు. అసలు నిత్యానంద ఆశ్రమంలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరముందని అన్నారు. నిరసనలు నిత్యానందను రాష్ట్రం నుంచి వెలివేయాలంటూ కర్ణాటక నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో బిడిది ఆశ్రమం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. నిత్యానంద పోస్టర్లను చించి, నిరసనలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ప్రహరీ ఎక్కి చిత్రీకరించేందుకు ప్రయత్నించడంతో నిత్యానంద శిష్యులు లోపలి నుంచి రాళ్లు రువ్వారు.