‘108 సమ్మె తాత్కాలికంగా విరమణ’
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: రాష్ట్రంలో 35 రోజుల నుం చి చేస్తున్న సమ్మెను 108 సిబ్బంది తాత్కాలికంగా విరమించుకుంటున్నారని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కఠారి అజయ్‌కుమార్ తెలిపారు. 108 సర్వీస్ కాంట్రాక్ట్ యూనియన్ ఉద్యోగుల సభను నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సమక్షంలో 108 యాజమాన్యం జరిపిన చర్చలు పాక్షికంగా సఫలమైనందున తాము తాత్కాలికంగా సమ్మెను విరమించామని వివరించారు. రూ.300 వేతనం పెంచడంతో పాటు, సిబ్బందిపై వేధింపులు ఆపుతామని, అదే విధంగా సస్పెండ్ చేసిన వారిని తి రిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పారన్నారు. నెల రోజులకు పై గా సిబ్బంది ఐక్యంగా ఉద్యమం చేశారని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సీఐటీయూ నాయకులు నరమాల సతీష్‌కుమార్, 108 యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.