Asus hybrid laptop
-
ల్యాప్‌టాప్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాప్‌టాప్!
ప్రముఖ తైవానీస్ కంప్యూటర్ హార్డ్ వేర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆసుస్ 2022 సీఈఎస్ టెక్ షోలో ప్రపంచంలోనే మొట్టమొదటి 17 అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్‌ని ఆవిష్కరించింది. ఈ ల్యాప్‌టాప్ 2022 మధ్యలో కొనుగోలుకు అమ్మకానికి రానుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి 17.3 అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్‌గా పేర్కొన్న జెన్ బుక్ 17 ఫోల్డ్ ఓఎల్ఈడీ ల్యాప్‌టాప్‌లో రెండు సైజుల ఓఎల్ఈడీ డిస్ ప్లేను కలిగి ఉంది. 1920 ఎక్స్ 1280పీ రిజల్యూషన్ గల ఈ ల్యాప్‌టాప్ డిస్ ప్లేను ఇంటెల్, బోటెక్నాలజీ గ్రూప్ భాగస్వామ్యంతో ఆసుస్ సహ-అభివృద్ధి చేసింది. ఇందులో ఉన్న ఆర్టిఫీషియల్ హెచ్డీఐఆర్ కెమెరా యూజర్ ఉనికిని గుర్తిస్తుంది. వెలుతురు బట్టి స్వయంచాలకంగా సర్దుబాటు చేసుకునే ఇంటిగ్రేటెడ్ కలర్ సెన్సార్ ఉంది. స్పష్టమైన వీడియో కాల్స్ కోసం ఆసుస్ 3డీ నాయిస్ రిడక్షన్(3డిఎన్ఆర్) టెక్నాలజీ గల 5 మెగా పిక్సల్ వెబ్ క్యామ్ ఇందులో ఉంటుంది. ఇది 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 యు-సిరీస్ ప్రాసెసర్లు, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ గ్రాఫిక్స్, 16 జీబీ ర్యామ్, 1 టీబీ ఎస్ఎస్డితో వస్తుంది. దీర్ఘకాలిక బ్యాటరీ కోసం 75 డబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అంతరిక్షంలోకి పంపిన మొదటి ఆసుస్ ల్యాప్ టాప్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుస్ ప్రత్యేక జెన్ బుక్ 14ఎక్స్ ఓఎల్ఈడీ స్పేస్ ఎడిషన్ (UX5401ZAS)ను కూడా ప్రకటించింది. (చదవండి: ఆన్లైన్ కిరాణా బిజినెస్‌పై రిలయన్స్ భారీ డీల్..! ఏకంగా...!) -
Asus Chromebook: మార్కెట్లో బాహుబలి ల్యాప్ ట్యాప్
ఖరీదైన ల్యాప్‌ట్యాప్ లను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అవి పగిలే పోయే అవకాశం ఉంది. కానీ తాజాగా మార్కెట్లో విడుదలైన ఆసుస్ బాహుబలి ల్యాప్ ట్యాప్ మాత్రం కింద పడినా పగలదు.ఇందుకోసం ప్రత్యేకమైన ఎక్విప్ మెంట్‌ను యాడ్ చేసినట్లు ఆసుస్ ప్రతినిధులు తెలిపారు. తైవాన్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఆసుస్ తన ప్రాడక్ట్‌ల విడుదలతో ఇండియన్ మార్కెట్లో సందడి చేస్తోంది. ఈ ఏడాది జులై నెలలో ఆసుస్ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214, క్రోమ్‌బుక్ సీ423, క్రోమ్‌బుక్ సీ523, క్రోమ్‌బుక్ సీ223 విడుదలతో హాట్ టాపిగ్గా మారింది. అయితే తాజాగా కింద పడినా డ్యామేజీ అవ్వకుండా ఉండేలా క్రోమ్‌బుక్ డిటాచబుల్ సీజెడ్1 (Asus Chromebook Detachable CZ1)ను విడుదల చేసింది. ఆసుస్ క్రోమ్‌బుక్ డిటాచబుల్ సీజెడ్1 స్పెసిఫికేషన్స్ 500 గ్రాముల బురువు ఉండే ఆసుస్ క్రోమ్‌బుక్ డిటాచబుల్ సీజెడ్1.. ఇంట్లో వినియోగించే డెస్క్, లేదంటే డైనింగ్ టేబుల్ పై నుంచి కింద పడినా పగలదు. పైగా కింద పడినా ప్రొటెక్ట్ చేసేలా నాలుగు వైపుల రబ్బర్ ట్రిమ్‌తో వస్తుందని ఆసుస్ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు గూగుల్ అస్టిస్టెంట్ వాయిస్ రికగ్నయిజేషన్ తో వినియోగదారుల్ని అలసరిస్తుండగా..1920x1200 పిక్సెల్స్,10.1 ఫుల్ హెచ్డీ, ఎల్సీడీ డబ్ల్యూయూఎక్స్‌జీఏ టచ్‌స్క్రీన్ డిస్ప్లే, 16:10 యాస్పెక్ట్ రేషియో,100 శాతం ఎస్ఆర్జీబీ, 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ పాటు క్రోమ్ ఓఎస్‌తో వస్తోంది. మీడియాటెక్ కంపానియో 500 (ఎంటీ8183) ప్రాసెసర్, ఆర్మ్ మాలి-జీ72 ఎంపీ3 జీపీయూ చిప్సెట్ తో వస్తుండగా 4జీబీ ర్యామ్, 128 జీబీ ఈఎంఎంసీ స్టోరేజీ చేసుకోవచ్చు. యూఎస్బీ టైప్-సీ పోర్టు, 3.5ఎంఎం జాక్, 1.5ఎంఎం కీట్రావెల్ కీబోర్డు తో పాటు టైపింగ్‌కు అనువుగా ఉండేలా ఎర్గో లిఫ్ట్ డిజైన్‌తో ఆకర్షిస్తుంది. 8 మెగాపిక్సెళ్ల రేర్ కెమెరా , 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 15 సెకన్ల పాటు చార్జింగ్ చేస్తే 45 నిమిషాల పాటు వినియోగించుకోవచ్చు. 27డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీతో వస్తున్నఈ క్రోమ్‌బుక్‌ను 11 గంటల వరకు నిర్విరామంగా వినియోగించుకునేలా బ్యాటరీ సదుపాయం ఉన్నట్లు ఆసుస్ తెలిపింది. ఆసుస్ క్రోమ్‌బుక్ డిటాచబుల్ అడ్జెస్ట్ మెంట్ కోసం స్టాండ్ తో వస్తుండగా..ఈ మోడల్ ధర ఎంతో తెలియాల్సి ఉంది. చదవండి : ఆపిల్ లాంచ్ చేయబోయే కొత్త ప్రాడక్ట్స్ ఇవే?! -
ఫోన్.. ల్యాప్‌టాప్.. ట్యాబ్లెట్
అసూస్ హైబ్రిడ్ ల్యాప్‌టాప్ తైవాన్‌కి చెందిన టెక్నాలజీ దిగ్గజం అసూస్ కొత్తగా ‘ట్రాన్స్ఫార్మర్ బుక్ ఫైవ్’ పేరిట హైబ్రిడ్ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ పీసీ, ఫోన్లను కలగలిపి మొత్తం అయిదు విధాలుగా ఉపయోగించుకునేలా దీన్ని కంపెనీ తీర్చిదిద్దింది. ట్యాబ్లెట్ తరహా ఉపయోగించేటప్పుడు ఆండ్రాయిడ్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో ఇది పనిచేస్తుంది. ఇందులోనే అయిదు అంగుళాల స్మార్ట్‌ఫోన్‌ను అసూస్ పొందుపర్చింది. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 3జీ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ వేగంగా బ్రౌజింగ్ స్పీడ్ అందిస్తుంది. పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులు, మీడియా సమక్షంలో అసూస్ చీఫ్ జానీ షిహ్ దీన్ని ఆవిష్కరించారు.