ఫోన్.. ల్యాప్‌టాప్.. ట్యాబ్లెట్
అసూస్ హైబ్రిడ్ ల్యాప్‌టాప్
తైవాన్‌కి చెందిన టెక్నాలజీ దిగ్గజం అసూస్ కొత్తగా ‘ట్రాన్స్‌ఫార్మర్ బుక్ ఫైవ్’ పేరిట హైబ్రిడ్ ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ పీసీ, ఫోన్‌లను కలగలిపి మొత్తం అయిదు విధాలుగా ఉపయోగించుకునేలా దీన్ని కంపెనీ తీర్చిదిద్దింది. ట్యాబ్లెట్ తరహా ఉపయోగించేటప్పుడు ఆండ్రాయిడ్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో ఇది పనిచేస్తుంది. ఇందులోనే అయిదు అంగుళాల స్మార్ట్‌ఫోన్‌ను అసూస్ పొందుపర్చింది. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 3జీ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ వేగంగా బ్రౌజింగ్ స్పీడ్ అందిస్తుంది. పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులు, మీడియా సమక్షంలో అసూస్ చీఫ్ జానీ షిహ్ దీన్ని ఆవిష్కరించారు.