టర్కీ అధ్యక్షుడికి విస్తృతాధికారాలు!
ఇస్తాంబుల్: టర్కీ అధ్యక్షుడికి విస్తృతాధికారాలు కల్పించే అంశంపై ఆదివారం జరిగిన రెఫరెండంలో ప్రజలు సానుకూలంగా స్పందించారు. 92 శాతం బ్యాలట్ బాక్సుల కౌంటింగ్ జరగ్గా, అధ్యక్షుడికి విస్తృతాధికారాలు ఇవ్వాలన్న ప్రతిపా దనకు అనుకూలంగా 52.1శాతం ఓట్లు, వ్యతి రేకంగా 47.9 శాతం ఓట్లు పడినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. దేశాధ్యక్షుడు తయ్యప్ ఎర్దోగన్ నేతృత్వంలో జరిగిన రెఫరెండం టర్కీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని భావి స్తున్నారు. 5 కోట్ల 80 లక్షల మంది రెఫరెండంలో ఓటేశారు.
ఫలితం ఎర్దోగన్కు అనుకూలంగా రావడంతో దేశ చరిత్రలో ఇంతవరకు ఏ అధ్యక్షునికీ లేనన్ని విస్తృతాధికారాలు ఆయనకు లభిస్తాయి. ఆధునిక టర్కీ వ్యవస్థాపకుడు అటాటర్క్, అతని తరువాత విజయవంతమైన అధ్యక్షునిగా పేరుగడించిన ఇస్మత్ ఇనోనూకు కూడాలేని అధికారాలు ఎర్దోగన్ వశమవుతాయి. కాగా, రిఫరెండంలో అక్రమాలు జరిగాయని, విపక్షాలు ఆరోపించాయి.