11న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికలు
బోట్‌క్లబ్(కాకినాడ): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న స్థానిక రంగరాయ మెడికల్ కళాశాల క్రీడామైదానంలో బాలబాలికలకు అథ్లెటిక్ క్రీడాంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక జరుగుతుందని కార్యదర్శి సీహెచ్‌వీవీ రమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికలు ఈ ఎంపిక పోటీలలో పాల్గొనవచ్చునన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 15 నుంచి 17 వరకూ విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు అసోసియేషన్ నిర్వాహక కార్యదర్శి స్పర్జన్రాజును సంప్రదించాలన్నారు.
14న బ్యాడ్మింటన్, చెస్, ఆర్చరీ, బాక్సింగ్ పోటీలకు ఎంపిక
స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–19 బాల్ బ్యాడ్మింటన్, చెస్, ఆర్చరీ, బాక్సింగ్ టీమ్ ఎంపిక ఈ నెల 14న రామచంద్రపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతుందని ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వై.తాతబ్బాయి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1997 జనవరి ఒకటి తరువాత జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులన్నారు. హాజరయ్యేవారు సంబంధిత ధృవపత్రాలు తీసుకురావాలని సూచించారు.