athletics training
-
13, 14 తేదీల్లో అథ్లెటిక్స్‌లో ఉచిత శిక్షణకు ఎంపికలు
సాక్షి, అమరావతి: ఆథ్లెటిక్స్ లోని వివిధ విభాగాల్లో అండర్ 14, 16, 18 కేటగిరీల్లో బాలబాలికలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్, స్టేట్ లెవల్ ఖేలో ఇండియా సెంటర్ (ఏఎస్ఆర్ స్టేడియం–ఏలూరు) ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు శాప్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే ఎంపిక పోటీల్లో అర్హత సాధించిన క్రీడాకారులకు స్పోర్ట్స్ హాస్టల్లో ఉచిత భోజన వసతితో కూడిన అథ్లెటిక్స్ శిక్షణ అందిస్తారు. వివరాలకు 98853 12356 నంబరులో సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇవీ చదవండి: ప్రియుడి మోజులో భార్య.. భర్త మెడకు చీరచుట్టి..ఆపై! మచ్చా అన్నందుకు డబుల్ మర్డర్ -
కోచ్ కాదు కామాంధుడు.. మసాజ్ పేరుతో మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులు
చెన్నై: శిక్షణ ఇవ్వాల్సిన ఓ కోచ్ కామంతో కళ్లు మూసుకుపోయి, మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతం ఒకటి తాజాగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన అథ్లెటిక్స్ కోచ్ పి. నాగరాజన్‌పై ఓ జాతీయ స్థాయి మహిళా అథ్లెట్(19) లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఈ ఏడాది మే నెలలో ఫిర్యాదు చేసింది. మసాజ్ పేరుతో కోచ్ తనను తాకరాని చోట తాకి పైశాచికత్వాన్ని ప్రదర్శించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. భయం కారణంగా కోచ్‌కు ఎదురు చెప్పలేకపోయానని, చాలా సందర్భాల్లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాని పేర్కొంది. ఈ కేసులో నాగరాజన్‌ను విచారించిన పోలీసులు అతనిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి, ఛార్జిషీట్ ఓపెన్ చేశారు. కాగా, ఈ ఉదంతం వెలుగు చూసాక మరో ఏడుగురు మహిళా అథ్లెట్లు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఫిర్యాదు చేసిన వారిలో కొందరు గతంలో నాగరాజన్ వద్ద శిక్షణ తీసుకున్న వారు కాగా, మరికొందరు ప్రస్తుతం జూనియర్లుగా శిక్షణ పొందుతున్నవారున్నారు. వీరందరూ కామ కోచ్ ఆకృత్యాలను ఒక్కొకటిగా బయటపెట్టడంతో పోలీసులు నివ్వెరపోతున్నారు. ఎంతో మంది అథ్లెట్లను జాతీయ స్థాయిలో ఛాంపియన్లుగా తీర్చిదిద్దిన నాగరాజన్.. ఇలాంటి దారుణాలకు పాల్పడ్డాడని తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. నాగరాజన్ వెదవ వేశాలపై మరికొందరు ట్విటర్ ద్వారా తమను సంప్రదించారని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: ఈ విషయంలో కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం -
మళ్లీ ట్రాక్ మీదకు పి.టి. ఉష
-
మళ్లీ ట్రాక్ మీదకు పి.టి. ఉష
అలనాటి పరుగుల రాణి పీటీ ఉష మళ్లీ ట్రాక్ మీదకు రాబోతోంది. గుజరాత్లో పిల్లలకు దీర్ఘకాలిక శిక్షణ ఇచ్చేందుకు ఆమె అంగీకరించినట్లు తెలిసింది. ప్రధాని నరేంద్రమోదీ కోరడంతో.. గుజరాత్లో కొంతమంది బాలలను ముందుగా వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి, వారికి చైనా తరహాలో దీర్ఘకాలిక శిక్షణ ఇవ్వడానికి ఉష గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అక్కడ 30 మంది పిల్లలను ఎంపిక చేసి, వాళ్లకు ప్రాథమిక శిక్షణ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్లు ఏయే విభాగాలకు సరిపోతారో అంచనా వేసి ఆ ప్రకారం వాళ్లను తీర్చిదిద్దడం ఈ దీర్ఘకాలిక ప్రణాళిక లక్ష్యం. ఇందుకోసం 10-11 ఏళ్ల వయసున్న పిల్లలను ఎంపిక చేస్తారు. సియోల్ ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని అథ్లెటిక్స్ విభాగంలో పీటీ ఉష రెపరెపలాడించిన విషయం తెలిసిందే. యువ క్రీడాకారులను తీర్చిదిద్ది, వారి ప్రతిభకు మెరుగులు దిద్దేందుకు ఆమె తీసుకున్న నిర్ణయం మంచిదేనని క్రీడా వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఆమె తన ఊరు సమీపంలో ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ను తెరిచింది. ఇటీవల ఆమె స్కూలు నుంచి వచ్చిన ముగ్గురు బాగా ప్రతిభ చూపారు. ఈ నేపథ్యంలో గుజరాత్ నుంచి మంచి మెరికల్లాంటి అథ్లెట్లను తయారుచేసేందుకు ఉష సేవలను వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ భావించారు.