ATM details
-
హైటెక్ మోసం
ఫోన్ తో సమాచారం తెలుసుకుని ఖాతాదారుని అకౌంట్ నుంచి రూ.94,990నగదును అపహరించిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది.టైర్ పంక్ఛర్ చేస్తూ జీవనం సాగిస్తున్నా సయ్యద్ మహబూబ్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 3న 9135310570 నెంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాము ముంబాయికి చెందిన ఎస్‌బిహెచ్ హెడ్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని మీ ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుందని నమ్మబలికాడు. కార్డు బ్లాక్ కాకుండా ఉండేందుకు ఏటీఎంపై ఉన్న 16 అంకెల సంఖ్యను చెప్పాలని అడిగాడు. నంబర్ సహాయంతో సదరు వ్యక్తి ఖతాదారుని ఆధార్ నంబర్, పూర్తి చిరునామా చెప్పాడు. తర్వాత ఫోన్ కు సమాచారం వస్తుందని.. అందులో ఉండే అంకెలను చెప్పాలని సూచించాడు. అగంతకుని మాటలు నమ్మిన సయ్యద్ తన ఫోన్ కు వచ్చిన నంబర్ చెప్పాడు. మరుసటి రోజు సైతం ఇదే విధంగా ఫోన్ చేసి సమాచారం తెలుసుకుని డబ్బులు డ్రా చేశాడు. మూడో సారి కూడా ఫోన్ రావడంతో అనుమానించి.. బ్యాంక్ కు వెళ్లి వాకబు చేయగా..రూ. 50 వేలు, రూ. 44, 990 డ్రా చేసినట్లు తెలిసింది. దీంతో కార్డు బ్లాక్ చేయించడంతో పాటు.. విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్బంగా బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలు, ఏటీఎంలకు సంబంధించిన వివరాలను ఎవరు అడిగినా చెప్పవద్దని సూచించారు. ఖాతాకు సంబంధించి ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే బ్యాంకులో సంప్రదించాలని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్ కాల్‌తో రూ. 5.1 లక్షలు హాంఫట్
మండపేట : ఫోన్ కాల్‌తో రూ. 5.1 లక్షలు హాంఫట్ చేసిన వైనమిది. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఏటీఏం వివరాలు తెలుసుకుని కొద్ది గంటల వ్యవధిలోనే మొత్తం సొమ్ములు డ్రా చేశాడు. ఈ ఘటనపై బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మారేడుబాక ఫైర్‌స్టేషన్ సమీపంలో నివసిస్తున్న శీలం వీరబాబు అనపర్తిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో రూ. 5.1 లక్షలు డిపాజిట్ చేశాడు. గత నెల 26 ఉదయం వీరబాబుకు ఫోన్‌కాల్ వచ్చింది. బ్యాంకు నుంచి ఫోన్ చేసున్నాం.. మీ ఏటీఎం కార్డు బ్లాకు అయ్యింది. ఫిన్ నంబరు, కార్డు వెనుక వైపున ఉన్న నంబరు, మీ వివరాలు చెప్పాలంటూ అడిగిన ప్రశ్నలన్నింటి కీ వీరబాబు సమాధానమిచ్చాడు. కొద్ది వ్యవధిలోనే వీరబాబు సెల్‌కు పాస్ వర్డ్‌లతో కూడిన నంబర్లు రావడం, ఏటీఎం కార్డు వినియోగంలోకి తీసుకు వస్తున్నాం మెసేజ్లోని పాస్ వర్డ్ చెప్పమంటూ ఆజ్ఞాత వ్యక్తి కోరాడు. ఈ విధంగా దాదాపు 13 సార్లు వీరబాబుకు వచ్చిన పాస్వర్డ్ వివరాలను అజ్ఞాత వ్యక్తి తెలుసుకున్నాడు. రాత్రికి చార్జింగ్ లేక సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. చార్జింగ్ పెట్టుకుని మరుసటి రోజు ఉదయం ఆన్ చేసుకుని చూసేసరికి అకౌంట్లో నగదు డ్రా చేసినట్టు మెసేజ్‌లు ఉన్నాయి. ఆందోళనకు గురైన వీరబాబు అనపర్తి వెళ్లి బ్యాంకు సిబ్బందిని సంప్రదించగా ఆన్లైన్లో అకౌంట్ క్లోజ్ చేసుకుని నగదు డ్రా చేసుకున్నారు కదా అంటూ ఎదురు ప్రశ్నించడంతో తాను మోసపోయానని గుర్తించి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హెచ్‌సీ సత్యనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.