ఏటీఎం మనీ విత్ డ్రా పరిమితి పెంపు
న్యూఢిల్లీ : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఏటీఎం మనీ విత్ డ్రా పరిమితిని పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతమున్న రూ.2,500 విత్ డ్రా పరిమితిని రూ.4,500కు పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఈ సదుపాయం జనవరి 1వ తేదీ నుంచి అమలులోనికి రానుంది. బ్యాంకుల నుంచి వారానికి రూ.24 వేల నగదు విత్ డ్రా పరిమితితో పాటు మిగతా ఆంక్షలు యథాతథంగా ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. గత 50 రోజులుగా పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు తాజా నిర్ణయం కొంత ఊరట ఇవ్వనుంది.