attack on couples
-
చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు చిరుత యత్నం
వడోదర: బైక్‌పై వెళ్తున్న దంపతులపై దాడి చేసిన చిరుత వారితోపాటు ఉన్న చిన్నారిని ఎత్తుకుపోయేందుకు యత్నించింది. అయితే, గ్రామస్తులు అప్రమత్తం కావటంతో ముగ్గురికీ ప్రాణాపాయం తప్పింది. గుజరాత్‌లోని గిరిజనులు ఎక్కువగా ఉండే చోటాదేవ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. విక్రమ్ రాథ్వా, సప్న దంపతులు. తమ నాలుగు నెలల కుమారుడు ఆయుష్‌తో కలిసి శనివారం సాయంత్రం బైక్‌పై వెళ్తున్నారు. పావిజెత్‌పూర్ పరిధిలోని రాయ్‌పూర్ గ్రామ సమీపంలో పొదల్లోంచి అకస్మాత్తుగా ప్రత్యక్షమైన చిరుత వారిపైకి దూకింది. సప్నను గాయపరిచి, శిశువును నోట కరుచుకునేందుకు యత్నించింది. అప్రమత్తమైన విక్రమ్ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని గ్రామస్తులు వెంటనే కర్రలతో వచ్చి చిరుత వెంటపడ్డారు. దీంతో భయపడిన చిరుత బాలుడిని వదిలేసి అడవి లోకి పారిపోయింది. గాయపడిన ముగ్గురినీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
భర్తను చంపించిన సరస్వతి కేసులో మరో నిజం
సాక్షి, విజయనగరం : పెళ్లైన కొన్ని రోజులకే ఫేస్బుక్ లవర్‌తో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేయించి, రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్వతీపురం సరస్వతి కేసులో మరో విస్తుపోయే నిజం పోలీసులు వెల్లడించారు. ఆదివారం విజయనగరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తనకు కాబోయే భర్త తన మేనబావ అయిన గౌరీ శంకర్‌ను హత్య చేయించడానికి సరస్వతి బెంగుళూరు ముఠాతో ఒప్పందం చేసుకుందని తెలిపారు. పెళ్లికి ముందే ఫేస్బుక్ లవర్ శివతో కలిసి బెంగుళూరుకు చెందిన ఓ ముఠాకు 25 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారని వెల్లడించారు. ఆ నగదును శివ ఆన్లైన్ నగదు చెల్లింపు యాప్ ద్వారా పంపినట్టు తెలిపారు. అయితే అడ్వాన్సు తీసుకున్న ముఠా ఫోన్ ఎత్తకపోవడంతో, విజయనగరానికి చెందిన మరో ముఠాతో ఒప్పందం చేసుకుని శివతో కలిసి సరస్వతి ఆమె భర్త గౌరీ శంకర్‌ను హత్య చేయించి, దుండగుల దాడిలో మరణించాడని నాటకమాడిన విషయం తెలిసిందే. -
నవ దంపతులపై దాడి
► ఐదుగురిపై కేసు కేకేనగర్ : తంజావూరు జిల్లా పాపనాశం సమీపంలో పెళ్లి జరిగిన 30 నిమిషాలకే నవ వధువు తరఫు వారు దాడి జరపడంతో సంచలనం కలిగింది. దీనికి సంబంధించి ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తంజావూరు సమీపంలో గల కరందై వీధికి చెందిన మణివన్నన్. ఇతని కుమారుడు రాజేష్ (22). బీబీఏ చదివి మినీబస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు ఒరత్తనాడు సమీపంలో గల వడక్కుర్ ప్రాంతానికి చెందిన వీరరాజు కుమార్తె అభినయ (22)ను ప్రేమించాడు. ఈ ఇద్దరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. సోమవారం అభినయ, రాజేష్ పాపనాశనం తాలూకా కార్యాలయం వెనుక గల దుర్గమ్మన్ ఆలయంలో రహస్య వివాహం చేసుకున్నారు. ఈ విషయం అభినయ కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆగ్రహించిన వారు పదిమందితో ఆలయం వద్దకు వచ్చారు. అక్కడ పెళ్లి చేసుకున్న రాజేష్, అభినయ దంపతులపై దుడ్డుకర్రలతో దాడి చేసి గాయపరిచారు. వెంటనే ప్రేమ జంట తప్పించుకుని పారిపోయి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పాపనాశం సహాయ పోలీసు సూపరింటెండెంట్ సెల్వరాజ్ వారి వద్ద విచారణ జరిపారు. రాజేష్, అభినయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు.